Venky kudumala : వెంకీ కుడుమలకి సినిమా లేకపోవడంతో అసోసియేట్‌గా మారాడా..?

Vedha - April 29, 2021 / 08:00 PM IST

Venky kudumala : వెంకీ కుడుమలకి సినిమా లేకపోవడంతో అసోసియేట్‌గా మారాడా..?

Venky kudumala : వెంకీ కుడుముల.. టాలీవుడ్ లో రెండు సినిమాలు తీసి వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. డెబ్యూ సినిమా ఛలో సినిమాని యంగ్ హీరో నాగ శౌర్య తో తెరకెక్కించాడు. ఈ సినిమాతో కన్నడ బ్యూటి రష్మిక మందన్న టాలీవుడ్ కి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుమలకి వరసగా ఆఫర్స్ వచ్చినప్పటికి యూత్ స్టార్ నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. రెండవ సినిమా భీష్మ తెరకెక్కించి నితిన్ కి సాలీడ్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించడం విశేషం.

is-venky-kudumala-changed-as-a-associate

is-venky-kudumala-changed-as-a-associate

అయితే భీష్మ తర్వాత వెంకీ కుడుమల పలువురు స్టార్ హీరోలతో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో వెంకీ కుడుమల నెక్స్ట్ సినిమా ఉండబోతోందని సోషల్ మీడియాలో అలాగే ఇండస్ట్రీ వర్గాలలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ కరోనా కారణంగా కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ మొదలవలేదు. దాంతో వెంకీ కుడుమల ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. దాంతో ఇప్పుడు తన గురువు అయిన మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కి సహాయకుడిగా ఉన్నాడని సమాచారం.

Venky kudumala : వెంకీ కుడుమల త్రివిక్రం తో సహాయకుడిగా ట్రావెల్ అవుతున్నాడట.

త్రివిక్రం ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న సినిమాకి మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారక ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న రాబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ కి వెంకీ కుడుమల త్రివిక్రం తో సహాయకుడిగా ట్రావెల్ అవుతున్నాడట.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us