Vaishnav tej : వైష్ణవ్ తేజ్ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లోనా..?

Vaishnav tej : వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెనతో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒక డెబ్యూ హీరో సినిమా దాదాపు 20 ఏళ్ల నుంచి ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. ఈ రికార్డ్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. దాంతో వరసగా టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్స్ కమిటవుతున్నాడు. ఇప్పటికే రెండవ సినిమా స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పూరి చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

is vaishnav-tej- next movie in sports backdrop...?
is vaishnav-tej- next movie in sports backdrop…?

కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఇదే టైటిల్‌ను పెట్టే ఉద్దేశ్యంలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి చాలా కీలకం. మళ్ళీ టాలీవుడ్‌లో తన సత్తా చాటాలంటే ఈ సినిమాతో రకుల్ హిట్ అందుకోవాల్సిందే. కాగా వైష్ణవ్ తేజ్ సెకండ్ సినిమా రిలీజ్ కాకుండా మూడవ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

Vaishnav tej : వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా నాగార్జున నిర్మాత..!

తమిళంలో ‘ఆదిత్యవర్మ’ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న గిరీషయ్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్టు సమాచారం. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. వైష్ణవ్ నాలుగో సినిమా కింగ్ నాగార్జున ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కనుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాతో పృథ్వీ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు హాకీ గేమ్ నేపథ్యంలో ప్లాన్ చేశారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.