Uppena : ఉప్పెన నిరాశపరచిందా..?

Uppena : ఉప్పెన.. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చి ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్కృతి శెట్టి టాలీవుడ్ కి పరిచయమయ్యారు. అంతేకాదు డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ 20 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. హీరో, హీరోయిన్.. దర్శకుడు కొత్త వారైన ఉప్పెన సంచలన విజయాన్ని అందుకుంది.

is uppena-dissappointed...?
is uppena-dissappointed…?

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరిలో వాలెంటైన్స్ వీక్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో నడిచింది. కరోనా లాక్ డౌన్ తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శించబడటం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇక ‘ఉప్పెన’ సినిమా ఓ క్లాసిక్ అని.. గత కొంతకాలంగా ఇలాంటి సినిమా రాలేదని మేకర్స్ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. అలానే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టిందని.. 100 కోట్ల క్లబ్ లో చేరిందని అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Uppena : ఉప్పెన ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదని తెలుస్తోంది.

సుకుమార్ సక్సస్ ఈవెంట్ లో ఈ సినిమా 100 కోట్లు సాధిస్తుందని చెప్పినట్టుగానే 100 కోట్ల క్లబ్ లో చేరింది. కాగా ఇటీవల బుల్లితెరపై ‘ఉప్పెన’ వచ్చింది. ప్రముఖ తెలుగు ఎంటర్టైమెంట్ ఛానల్ ‘స్టార్ మా’ లో ఏప్రిల్ 18వ తేదీన ‘ఉప్పెన’ సినిమా ప్రసారమైంది. ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పైన కూడా బాగా సత్తా చాటుతుందని.. హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వస్తుందని అందరూ భావించారు. థియేటర్ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా బుల్లితెర మీద కూడా అదే రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయాలి. కానీ ఈ సినిమా ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదని తెలుస్తోంది.

Advertisement