Trivikram : త్రివిక్రమ్ ఇలా కూడా ప్లాన్ చేస్తున్నాడా..?

Trivikram : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కంటే ముందు రచయితగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన సంగతి తెలిసిందే. స్వయంవరం, చిరునవ్వుతో, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, జై చిరంజీవ, తీన్‌మార్, నువ్వే కావాలి లాంటి సినిమాలకి రచయితగా పని చేశాడు. రచయితగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత దర్శకుడిగా మారి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ తీస్తున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

is trivikram-planning in this way....?
is trivikram-planning in this way….?

ఇక యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్‌ తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్ .. మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఎన్.టి.ఆర్‌ తో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవగా మహేష్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. మే 31న ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా త్రివిక్రమ్ కథ కూడా సిద్దం చేసి వేరే దర్శకులకు ఇస్తుంటాడు. అలా కథ రాసి ఇచ్చినందుకు కూడా భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.

Trivikram : త్రివిక్రమ్ సిద్దంగా ఉన్నట్టు తెలిస్తోంది.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఇంతక ముందు పవన్ కళ్యాణ్ తో కోబలి టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నాడు. ఈ సినిమా కథ కూడా రెడీ చేసుకున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇక రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్ లో కోబలి ఉంటుందనుకున్నారు. కానీ పవన్ కమిటయిన సినిమాలలో త్రివిక్రమ్ సినిమా లేదు. అయితే కోబలి కథను వేరే దర్శకుడికి ఇవ్వడానికి త్రివిక్రమ్ సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేదు గాని.. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement