Mahesh babu : మహేష్ బాబు తో సీక్వెల్ వర్కౌట్ అవుతుందా..?

Mahesh babu : మహేష్ బాబు సీక్వెల్ సినిమాలు చేయడం గాని, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు మళ్ళీ చేయాలనుకోవడం గానీ ఇప్పటి వరకు జరగలేదు. అసలు ఆ ఆలోచననే మహేష్ కి రాలేదు. చాలా మంది మహేష్ కెరీర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాకి సీక్వెల్ చేస్తాడని భావించారు. కానీ ఇలాంటి సినిమాలను మళ్ళీ ముట్టుకోకూడదన్నది మహేష్ సిద్దాంతం. కొన్ని క్లాసిక్స్ ని టచ్ చేయకపోతేనే మంచిదని గతంలో చెప్పిన మాట కూడా గుర్తుండే ఉంటుంది.

is-the-sequal-worksout-with-mahesh-babu
is-the-sequal-worksout-with-mahesh-babu

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక సినిమా సీక్వెల్ చేసేందుకు మహేష్ ఆసక్తి చూపిస్తున్నాడని ప్రచారం మొదలైంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్ సినిమాగా నిలిచింది. దాంతో మరోసారి మహేష్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి సరిలేరు సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. అనిల్ రావిపూడికి సీక్వెల్స్ మీద బాగా ఆసక్తి ఉంటుంది.

Mahesh babu : మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

అందుకే ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మాస్ మహారాజ రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ కూడా చేసే ప్లాన్ లో అనిల్ రావిపూడి ఉన్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా సీక్వెల్ చేయాలని కథ రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. మరి మహేష్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement