NTR : ఎన్టీఆర్ 30 జోనర్ ఇదేనా..?

NTR : ఎన్టీఆర్ 30 రీసెంట్‌గా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 రావాల్సి ఉండగా అనూహ్యంగా కాంబినేషన్ మారింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. ఇంతక ముందు కొరటాల శివ – ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ భారీ హిట్ అందుకుంది. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీటవుతుందంటే అంచనాలు భారీగా నెలకొన్నాయి.

is that the ntr-zoner...?
is that the ntr-zoner…?

ఇక ఈ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి కథ ఏమై ఉంటుందా అన్న ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో కొరటాల శివ రూపొందించబోతున్న ఈ తాజా సినిమాని రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబుతో ఇంతకముందు కొరటాల శివ ‘భరత్ అను నేను’ సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే తీసి భారీ హిట్ ఇచ్చాడు. ఆ కారణంగా కూడా ఈ కాంబినేషన్ లో వచ్చేది పొల్టికల్ బ్యాక్ డ్రాప్ అనగానే హిట్ అంతే అంటూ తారక్ అభిమానులు చెప్పుకుంటున్నారట.

NTR : ఎన్టీఆర్ తో పొల్టికల్ బ్యాక్ డ్రాప్ సినిమా ..?

ప్రజల సమస్యల మీద పోరాడిన ఒక సామాన్యమైన వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది.. రాజకీయాల్లో వచ్చిన తారక్ ఏం చేశాడన్నది ఆధ్యంతం ఆసక్తికరంగా చూపించబోతున్నాడట. ప్రస్తుతం అభిమానులు, ప్రేక్షకులు ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని కాంక్షిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కొరటాల తారక్ తో పొల్టికల్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటే ఖచ్చితంగా అన్నీ విధాల కరెక్ట్ ఛాయిస్ అని తెలుస్తోంది. చూడాలి మరి కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో వచ్చేది ఏ కథో.

Advertisement