Vakeel saab : వకీల్ సాబ్ తర్వాత ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఇక కనిపించదా ..?

Vakeel saab : వకీల్ సాబ్ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీస్తున్న సినిమా. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వేణు శ్రీరాం ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ కి మూడవ సినిమా కావడం విశేషం. కాగా ఈ సినిమా బాలీవుడ్ హిట్ సినిమా పింక్ కి రీమేక్ గా రూపొందించారు. కోలీవుడ్ లో కూడా అజిత్ హీరోగా నేకొండ పార్వై గా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది.

is-that-talented-heroine-does-not-appear-after-vakeel-saab
is-that-talented-heroine-does-not-appear-after-vakeel-saab

ముఖ్యంగా హిందీలో వచ్చిన పింక్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర తర్వాత మళ్ళీ అంతా పేరు వచ్చింది తాప్సీ పోషించిన పాత్రకే. ఇప్పుడు అదే పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ కంపించబోతోంది. ఈ మధ్య కాలంలో నివేదా థామస్ నుంచి వరసగా సినిమాలు రావడం లేదు. గత ఏడాది రజనీకాంత్ – నయనతార నటించిన దర్బార్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఫ్లాపవడం తో నివేదా కి ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు. అలాగే నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన వి సినిమాలో కూడా నివేదా థామస్ ఒక హీరోయిన్ గా నటించింది.

Vakeel saab : వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ తర్వాత అంత క్రేజ్ వచ్చే క్యారెక్టర్ నివేదా థామస్ దే..?

అయితే ఈ సినిమా ఓటీటీ లో రిలీజవడం ఒక కారణం .. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోవడం మరొక కారణంగా పెద్దగా వి సినిమా కూడా నివేదా కి ఉపయోగపడలేదు. కాగా త్వరలో వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నివేదా థామస్. తెలుగులో నివేదా చేస్తున్న సినిమా ఇదొక్కటే. ఈ సినిమా రిజల్ట్ గనక తేడా కొడితే ఇక టాలీవుడ్ లో నివేదా కనిపించడం కష్టమని చెప్పుకుంటున్నారట. అయితే వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ తర్వాత అంత క్రేజ్ వచ్చే క్యారెక్టర్ నివేదా థామస్ దే అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా నివేదా కి ఎంతవరకు ఉపయోగపడుతుందో.

Advertisement