Tapsee : తాప్సీ టాలీవుడ్ వైపు చూస్తోందా..?

Tapsee : తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా బిజీ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయి. ఇక బాలీవుడ్‌లో తాప్సీ కోసం కొత్త కథలు తయారవుతున్నాయి. ఇంత బిజీగా ఉన్న తాప్సీ మళ్ళీ టాలీవుడ్ వైపు చూస్తుందా.. అంటే అవునన్న మాటే వినిపిస్తోంది. తాప్సీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ముందు టాలీవుడ్ సినిమాలతోనే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత వరసగా స్టార్ హీరోలతో పెద్ద సినిమాలే చేసింది.

is-tapsee-looking-at-tollywood
is-tapsee-looking-at-tollywood

కానీ టాలీవుడ్‌లో భారీ హిట్ మాత్రం తాప్సీకి దక్కలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం..అక్కడ తాప్సీ నటించిన సినిమాలు వరసగా సూపర్ హిట్ అవుతుండటంతో మంచి క్రేజీ స్టార్‌గా మారిపోయింది. కమర్షియల్ అండ్ గ్లామర్ రోల్స్ చేస్తూనే పింక్, బద్లా, నాం షభానా లాంటి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ బాగా గుర్తింపు సాధించింది. తెలుగులో ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘గుండెల్లో గోదారి’, ‘సాహసం’, ‘ఘాజీ’, ‘ఆనందో బ్రహ్మ’, ‘నీవెవరో’. ‘గేమ్ ఓవర్’ సినిమాలు చేసిన తాప్సీకి టాలీవుడ్‌లో చాలానే గ్యాప్ వచ్చింది.

Tapsee : తాప్సీ ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది.

కాగా మరోసారి సౌత్ సినిమాలలో అవకాశం వస్తే చేయాలని రెడీగా ఉందట. హీరోయిన్‌గా మాత్రమే కాదు నెగిటివ్ రోల్ వచ్చినా చేయాలని ఆసక్తితో ఉన్నట్టు తాజా సమాచారం. బాలీవుడ్‌లో తాప్సీ ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది. ‘హసీన్ దిల్ రుబా’ ‘రశ్మీ రాకెట్’ ‘లూప్ లపేటా’ ‘దొబారా’ సినిమాలు ఇప్పటికే షూటింగ్స్ పూర్తయి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోన్న మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’ షూటింగ్ దశలో ఉంది. ఈ ఐదు సినిమాలు కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలు కావడం విశేషం.

Advertisement