Shruthi hassan : శృతి హాసన్ సీనియర్ హీరోకి నో చెప్పిందా .?

Vedha - March 4, 2021 / 08:30 AM IST

Shruthi hassan : శృతి హాసన్ సీనియర్ హీరోకి నో చెప్పిందా .?

Shruthi hassan : శృతి హాసన్ సీనియర్ హీరోకి నో చెప్తుందా.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మూడేళ్ళ తర్వాత టాలీవుడ్ లో క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చేసింది. ఇక వకీల్ సాబ్ లో మరొక సారి పవన్ కళ్యాణ్ కి జంటగా నటించింది. ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే తమిళంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తో కలిసి లాభం అన్న సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇలా వరసగా సినిమాలు కమిటవుతున్న శృతి హాసన్ కి అనూహ్యంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం అందుకుంది.

is-shruthi-hassan-says-no-to-senior-hero

is-shruthi-hassan-says-no-to-senior-hero

ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ అన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మూడేళ్ళుగా సినిమాలు చేయని శృతి హాసన్ కి క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ దక్కడం ఆ తర్వాత ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం ఎవరూ ఊహించనిది. ఈ క్రమంలో తనకి మంచి కం బ్యాక్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని కి ఈ బ్యూటీ సింపుల్ గా నో చెప్పిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

Shruthi hassan : శృతి హాసన్ బాలయ్య సినిమా కి మాత్రం నో చెప్పిందని సమాచారం.

క్రాక్ హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కి మైత్రీ వారు భారీ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాలయ్య చేస్తున్న బిబి 3 కంప్లీట్ కాగానే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ క్రమంలో బాలయ్య కి జంటగా మేకర్స్ శృతి హాసన్ ని తీసుకోవాలని భావించి సంప్రదించారట. కాని ప్రభాస్ తో చేస్తున్న శృతి హాసన్ బాలయ్య సినిమా కి మాత్రం నో చెప్పిందని సమాచారం.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us