Sharwanand : ‘ఒకే ఒక జీవితం’ .! శర్వానంద్ ఓటీటీ ప్రేక్షకుల్ని మెప్పించగలడా.?

NQ Staff - September 26, 2022 / 09:01 AM IST

Sharwanand : ‘ఒకే ఒక జీవితం’ .! శర్వానంద్ ఓటీటీ ప్రేక్షకుల్ని మెప్పించగలడా.?

Sharwanand : ‘శతమానం భవతి’ సినిమా తర్వాత శర్వానంద్ ఆ స్థాయి విజయం అందుకోలేదు. ‘శ్రీకారం’ తదితర సినిమాలతో ఓ మోస్తరు విజయం అందుకున్నాడంతే. ఇక, లేటెస్టుగా శర్వానంద్ నుంచి వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.సెప్టెంబర్ 16 వ తేదీన రిలీజైన ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే.

కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ సినిమాని తెరకెక్కించాడు. టైమ్ ట్రావెల్‌కి మదర్ సెంటిమెంట్ ఆపాదించి దర్శకుడు కథనాన్ని నడిపిన వైనం ఆడియన్స్‌ని కట్టి పడేసింది. 15 కోట్లకు రైట్స్ దక్కించుకున్న ఆ ఓటీటీ ఛానెల్..దాంతో సినిమాకి హిట్ కట్టబెట్టారు ప్రేక్షక దేవుళ్లు. అలా శర్వానంద్ తన కెరీర్‌లో హిట్టు లిస్టులోకి చేర్చుకున్నాడు ‘ఒకే ఒక జీవితం’ సినిమాని. ధియేటర్లలో ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. నిర్మాతలకూ బాగానే లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక విడుదలైన ఆరు వారాల తర్వాత డిజిటల్ స్ర్టీమింగ్‌కి సిద్ధమవ్వాలి ఏ సినిమా అయినా. ఆ క్రమంలోనే ‘ఒకే ఒక జీవితం’ డిజిటల్ హక్కుల్ని సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 15 కోట్లకు సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని కైవసం చేసుకుందట.అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రిలీజ్ చేయనున్నారు. సీనియర్ నటి అమల ఈ సినిమాలో శర్వాకి తల్లిగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ధియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us