Sekhar kammula : శేఖర్ కమ్ముల ఇంకా పక్కాగా చెక్కుతున్నాడా..!

Sekhar kammula : శేఖర్ కమ్ముల సినిమా తర్వాత సినిమా చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ పూర్తిగా వేరే. ఆయన సినిమా జోనర్స్ అన్నీ క్లాస్‌గా ఉంటాయి. అంతేకాదు కమర్షియల్ సినిమా తీస్తేనే జనం చూస్తారన్న రూల్స్ పెట్టుకోడు. సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేయాలి అని లెక్కలేమీ ఉండవు. కొత్త వాళ్ళతో సినిమా చేసి హిట్ కొట్టగలడు..స్టార్స్ తో సినిమా తీసి హిట్ కొట్టగలడు. అందుకు ఉదాహరణ హ్యాపిడేస్, ఫిదా సినిమాలే.

is Sekhar kammula planning more perfectly..!
is Sekhar kammula planning more perfectly..!

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరి. అక్కినేని నాగ చైతన్య – ఫిదా బ్యూటి సాయి పల్లవి జంటగా నటించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ – అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల సారంగ దరియా సాంగ్ కూడా యూట్యూబ్ లో వ్యూస్ పరంగా భారీ రికార్డ్ క్రియేట్ చేసింది.

Sekhar kammula : లవ్ స్టోరి హిట్ అవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. ఏప్రిల్ 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో పోస్ట్‌పోన్ చేసుకున్నారు. దీంతో దర్శకుడు శేఖర్ కమ్ముల బెటర్మెంట్ కోసం ఇంకా చెక్కే పనిలో ఉన్నాడట. ప్రతీ షాట్ పర్‌ఫెక్ట్ వచ్చేలా ప్రయత్నిస్తున్నాడట. అంటే ఫిదా రేంజ్ ని మించి లవ్ స్టోరి హిట్ అవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా రిలీజయ్యాక ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో.

Advertisement