Rhea Chakraborty: రియా చక్రవర్తి మళ్ళీ ప్రేమలో పడిందా.?

NQ Staff - May 18, 2022 / 07:07 AM IST

Rhea Chakraborty: రియా చక్రవర్తి మళ్ళీ ప్రేమలో పడిందా.?

Rhea Chakraborty: బెంగాలీ భామ రియా చక్రవర్తి కొన్నాళ్ళ క్రితం డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అరెస్టయ్యింది కూడా. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ప్రేమలో పీకల్దాకా మునిగి తేలిన ఈ బ్యూటీ, ఆ సుశాంత్ మృతికి కారకురాలనే అభియోగాల్ని కూడా మోయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

Is Rhea Chakraborty in Relationship Again?

Is Rhea Chakraborty in Relationship Again?


సుశాంత్, రియా ప్రేమించుకుని.. పెళ్ళి చేసుకోవాలనుకున్నా.. ఇద్దరి మధ్యా మనస్పర్ధలు తలెత్తాయట. ఆ ఒత్తిడితోనే సుశాంత్, రియాని దూరం చేసుకున్నాడనీ, ఆ తర్వాత ఆమెను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించి, ఈ ప్రయత్నంలో మరింత ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడనీ ఆరోపణలున్నాయి.

అయితే, సుశాంత్‌ని తాను మనస్ఫూర్తిగా ప్రేమించాననీ, ఇద్దరం పెళ్ళి చేసుకోవాలనుకున్నామనీ రియా చక్రవర్తి, సుశాంత్ మరణం తర్వాత వాపోయింది. సుశాంత్ లేని జీవితం కష్టంగా వుందంటూ అప్పట్లో పేర్కొన్న రియా, క్రమంగా సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేసింది.

పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటోన్న రియా చక్రవర్తి, జీవితంలో ముందడుగు వేయాలనే నిర్ణయానికి వచ్చిందట. ఈ బ్యూటీ తాజాగా ఓ బాలీవుడ్ ప్రముఖుడితో ప్రేమలో పడిందంటూ బీ టౌన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దాంతో, సుశాంత్ అభిమానులు రియా చక్రవర్తిని మళ్ళీ టార్గెట్ చేశారు. అయితే, ఈ ప్రచారంపై ఇంతవరకు రియా చక్రవర్తి స్పందించకపోవడం గమనార్హం. తెలుగులో రియా చక్రవర్తి ‘తూనీగ తూనీగ’ సినిమా చేసింది. మెగా మేకర్ ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా అది.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us