Regina : రెజీనా కెరీర్ ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉందా..?

Regina : రెజీనా కసాండ్ర కెరీర్ ప్రారంభంలో వరసగా సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రెజీనా. ‘రోటీన్ లవ్ స్టోరీ’ సినిమాతో మంచి హిట్ కొట్టినప్పటికీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో పిల్లా నువ్వే లేని జీవితం హిట్ అందుకునేంత వరకు రెజీనా కి టాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ దక్కలేదు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ మేకర్స్ దృష్ఠిని అలాగే యంగ్ హీరోల దృష్ఠిని ఆకర్షించింది రెజీనా.

is regina-career in their hands...?
is regina-career in their hands…?

ఆ తర్వాత ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘అ’ వంటి లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘అ’ సినిమాలో రెజీనా పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి.. ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకొని క్రేజీ హీరోయిన్ గా మారింది. గ్లామర్ రోల్స్ తో పాటు నటనకి ప్రాధాన్యత ఉన్న కథలని ఎంచుకొని మంచి హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఎవరు సినిమాతో తన సత్తా మరోసారి చూపించింది.

Regina : రెజీనా ఈ బ్యానర్ లో ఆఫర్ రావటం అంటే ఖచ్చితంగా తన కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్..!

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో ఏకంగా మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది రెజీనా. కాగా బాహుబలి సినిమా నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న వెబ్ సిరీస్ లో రెజినా నటించబోతుందని తాజా సమాచారం. శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని త్వరలో ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుండగా ఈ వెబ్ సిరీస్ లో రెజీనాని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రెజీనా ఈ బ్యానర్ లో ఆఫర్ రావటం అంటే ఖచ్చితంగా తన కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.

Advertisement