Raviteja : రవితేజ సరసన ధనుష్ హీరోయిన్..?

Raviteja : మాస్ మహారాజ రవితేజ క్రాక్ తర్వాత ఫుల్ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రవితేజ ఎనర్జీకి దాదాపు మూడేళ్ళ నుంచి సరైన హిట్స్ పడలేదు. దాంతో క్రాక్ సినిమా ఎంచుకొని తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయాడు. భారీ హిట్ దక్కింది. కరోనా క్రైసిస్‌లో 50 % ఆక్యుపెన్సీతోనూ రికార్డ్ స్థాయిలో హిట్ అందుకొని ఇండస్ట్రీకి ధైర్యాన్నిచ్చాడు. ఇక వరుసగా సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఖిలాడి అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు.

is raviteja-with Danush heroine...?
is raviteja-with Danush heroine…?

డ్యూయల్ రోల్‌లో రవితేజ నటిస్తున్న ఈ సినిమాను రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. జయంతి లాల్ గడ పెన్ స్టూడియోస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ వారమే రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. పరిస్థితులు చక్కబడితే బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయనున్నారు.

Raviteja : రవితేజ సరసన రజిష విజయన్ కి అవకాశం వచ్చినట్టు సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ నటించబోయో సినిమా ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించనున్నట్టు ప్రకటించారు. కాగా ఇందులో మరొక హీరోయిన్ కూడా ఉందని ఆ పాత్రకి ధనుష్ నటించిన కర్ణన్ సినిమాలోని హీయిన్ రజిష విజయన్ ని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. రజిష విజయన్ కర్ణన్ లో పోషించిన పాత్రతో కోలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు టాలీవుడ్ మేకర్స్‌ను బాగానే ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే రవితేజ సరసన అవకాశం వచ్చినట్టు సమాచారం.