Rana Daggubati: భీమ్లా నాయ‌క్ సినిమాలో రానా ఉన్న‌ట్టా, లేన‌ట్టా..!

Rana Daggubati: మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియమ్ రీమేక్‌గా రూపొందుతున్న భీమ్లా నాయ‌క్ చిత్రం ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్నారు.సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ మాట‌లు అందిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ సినిమా రూపొందుతుంది.


Is Rana Daggubati there in Bheemla Nayak Movie?
Is Rana Daggubati there in Bheemla Nayak Movie?


మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హిందీలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన.. ‘పింక్’ సినిమా రీమేక్‌గా రూపొందిన వకీల్‌సాబ్‌ సినిమాతో వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో పవన్‌ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించడమే కాక.. బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినాని నిరూపించుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్‌గా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తే రానా మ‌రో పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.


ఈ మూవీ మ‌ల్టీస్టార‌ర్‌నే కానీ టైటిల్‌లో ప‌వ‌న్ ఒక్క‌డే క‌నిపిస్తున్నాడు. రానాను పూర్తిగా ప‌క్క‌న‌బెట్టేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌నే వాడుకుంటూ భీమ్లా నాయ‌క్ సినిమాను తీసుకున్నారు. నిజానికి మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీన‌న్ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు ఒకే ర‌క‌మైన ఇంపార్టెన్స్ ఉంటుంది. టైటిల్ లోనూ రెండు పాత్రల పేర్లనే కలిపి పెట్టారు. కానీ తెలుగులోకి వ‌చ్చేసరికి రానా పాత్ర‌ను త‌గ్గించేసారు.


సినిమా మొదలైనప్పటి నుంచి ప్ర‌మోష‌న్స్ బాగానే చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ప్ర‌చార చిత్రాల‌లో ప‌వ‌న్‌ని చూపించారే త‌ప్ప రానాని ఎక్క‌డా చూపించ‌లేదు. దీనిని పవన్ మూవీగానే చూస్తున్నారు. రానా కూడా స్టార్ హీరోనే అయినప్పటికీ ఇప్పటివరకూ ఎక్కడా ఆయన పేరును కూడా లేవనెత్తలేదు. దీంతో ఇంతకీ ఇది మల్టీస్టారరేనా ? అనే అనుమానం వస్తోంది.


మేక‌ర్స్ ప‌ద్ద‌తి చూస్తుంటే సినిమా నుంచి రానాని పక్కకు పెట్టేశారేమోన‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రశ్న అడిగాడు. “మల్టీస్టారర్ మూవీని సోలో హీరో మూవీ చేసేశారు” అంటూ ట్వీట్ చేశాడు. సదరు నెటిజన్ ట్వీట్ పై స్పందించిన “భీమ్లా నాయక్” నిర్మాత నాగ వంశీ అప్పుడే ఒక నిర్ధారణకు రావొద్దని, అన్నీ ఆర్డర్ ప్రకారంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. మరి అది ఎప్పుడు జ‌రుగుతుందో చూడాలి. ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ నుండి టైటిల్ సాంగ్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.