Puri jagannaadh : పూరి జగన్నాధ్ .. మాస్ మహారాజా తో ట్రై చేస్తున్నాడా..?

Puri jagannaadh : పూరి జగన్నాధ్ లాక్ డౌన్ లో కథలు రాశాడని ఏమంటూ ఛార్మి వెల్లడించిందో గాని అప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దాదాపు పూరి జగన్నాధ్ 6-7 కథలు రాశాడని ఛార్మి చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో పూరి జగన్నాధ్ .. పలానా స్టార్ హిరోతో సినిమా చేయబోతున్నాడని వార్తలు రాసేస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాధ్ బాలయ్య తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి పైసా వసూల్ సినిమా చేశారు. దాంతో ఖచ్చితంగా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

is-puri-jagannaadh-trying-to-make-a-movie-with-mass-maha-raj
is-puri-jagannaadh-trying-to-make-a-movie-with-mass-maha-raj

ఇక నాగార్జున తో కూడా పూరి జగన్నాధ్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. నాగార్జున తో శివమణి, సూపర్ సినిమాలు తీసి హిట్స్ ఇచ్చిన పూరి తో నాగార్జున ఎప్పుడు సినిమా చేయడానికైనా రెడీ అంటాడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ అయ్యే అవకాశాలున్నాయని అనుకోవచ్చు. ఇక కేజీఎఫ్ తో పాన్ ఇండియన్ స్టార్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న యష్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో కూడా సినిమా రూపొందబోతుందని అన్నారు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ కి మంచి క్రేజ్ ఉంది. కాని యష్ తో సినిమా అంటే కాస్త ఆలోచించాలి.

Puri jagannaadh : పూరి చేయాలనుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ..?

కాగా మళ్ళీ చాలా కాలానికి మాస్ మహారాజా రవితేజ తో పూరి జగన్నాధ్ సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. అటు పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫాం లోకి వచ్చి ప్రస్తుతం లైగర్ అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఇక రవితేజ రీసెంట్ గా క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ అంటే అభిమానులకి ఊపొచ్చే న్యూసే. మరి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి. పూరి చేయాలనుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండగా .. పవన్ కళ్యాణ్ తో కూడా పూరి సినిమా చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే మహేష్ బాబు తో సినిమా ఉంటుందని ఈ మధ్య న్యూస్ ఒకటి బాగా స్ప్రెడ్ అవుతోంది. వాస్తవంగా ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా జనగణమన తెరకెక్కాల్సింది.

Advertisement