Priya prakash : ప్రియా ప్రకాష్ కి టాలీవుడ్ లో ‘ చెక్ ‘ పెట్టే సత్తా ఉందా ..?

Priya prakash : ప్రియా ప్రకాష్ .. ఒరు అదార్ లవ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకుండానే కన్నుగీటి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. జస్ట్ అలా ఉన్న కొన్ని సెకండ్స్ టీజర్ తో స్టార్ హీరోయిన్ కి వచ్చినంత క్రేజ్ వచ్చేసింది. ప్రియా ప్రకాష్ కన్నుకొట్టే వీడియోన్ స్లో మోషన్ లో చూపించి కామన్ ఆడియన్స్ నుంచి సినిమా స్టార్స్ వరకు అందరి దృష్టిని మళ్ళించారు. తెలుగులో యంగ్ హీరోలందరూ ప్రియా ప్రకాష్ కన్ను కొట్టిన వీడియోకి కోట్లల్లో ఫిదా అయిన వాళ్ళు ఉన్నారు. అదే క్రేజ్ తో ప్రియా ప్రకాష్ క్రేజీ ఆఫర్స్ దక్కించుకోవాలని ట్రై చేసింది.

is-priya-prash-can-keep-check-in-tollywood
is-priya-prash-can-keep-check-in-tollywood

ఆ సమయంలో ప్రియా ప్రకాష్ కి సినిమాలలో అవకాశాలు వస్తే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి నిర్మాతలకి చుక్కలు చూపించని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రియా ప్రకాష్ బ్యాడ్ టైం .. తన అనుకున్న ప్లాన్ అన్నీ బెడిసి కొట్టి తన డెబ్యూ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. పైగా ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ ది పెద్దగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదని రిలీజయ్యాక తెలిసింది. దాంతో అందరు ప్రియా ప్రకాష్ ని లైట్ తీసుకున్నారు. ఇదొక మైనస్ అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని బాలీవుడ్ లో శ్రీదేవీ బంగళా అన్న సినిమా చేసింది.

Priya prakash : ప్రియా ప్రకాష్ ఇప్పుడున్న హీరోయిన్ కి చెక్ పెట్టే సత్త ఉందా ..?

ఈ సినిమా ట్రైలర్ తో ప్రియా ప్రకాష్ గ్యారెంటీగా సూపర్ హిట్ కొడుతుందని బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతుందని అనుకున్నారు. కాని టైటిల్ వల్ల కాంట్రవర్సీ కావడం తో సినిమా రిలీజ్ కాకుండా ల్యాబ్ కే పరితమితమయింది. దాంతో ఈ యంగ్ బ్యూటీ ఈ పాటికే క్రేజీ హీరోయిన్ గా మంచి ఫాంలో ఉండాల్సింది… అవకాశాల కోసం ఆవురారంటోంది. ఈ క్రమంలో తాజాగా నటించిన చెక్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. రీసెంట్ గా చెక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ తన సెకండ్ హోం అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా సక్సస్ అయినా టాలీవుడ్ లో వరసగా అవకాశాలు అందుకొని ఇప్పుడున్న హీరోయిన్ కి చెక్ పెట్టే సత్త ఉందా .. లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

Advertisement