Prabhas : ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా జోనర్ ఇదే అయితే హాలీవుడ్ సినిమానే ..!

Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కమిటయిన సినిమాలలో వైజయంతీ మూవీస్ నిర్మించే ప్రాజెక్ట్ ఒకటి. చిత్ర నిర్మాణ సంస్థకి 50వ సినిమా కావడంతో పాన్ ఇండియన్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సి.అశ్వనీదత్ నిర్మాతా రూపొందనున్న సినిమాకి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నాడు. సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు క్రియేటివ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకోన్ నటించబోతోంది.

is prabhas-nag aswin movie a science fiction story
is prabhas-nag aswin movie a science fiction story

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇంత భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా జోనర్ ఏంటనేది మాత్రం ఇంతవరకు మేకర్స్ నుంచి చిన్న హింట్ కూడా రాలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో మాత్రం ఇదే జోనర్ అంటూ ఓ వార్త షికారు చేస్తోంది.

Prabhas : ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ కొద్దిపాటు చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నారు.

హాలీవుడ్ సినిమాను తలపించేలా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం. మరో మూడు నెలల్లో సెట్స్ మీదకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ టైం ఈ సినిమాతో పాన్ వరల్డ్ వైడ్ గా తన మ్యూజిక్ వినిపించబోతున్నాడు మిక్కీ జే మేయర్. కాగా ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ కొద్దిపాటి చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నారు.