పూనమ్ కౌర్ అనుకొని కూడా సాధించలేకపోయిందా ..?

బ్యూటి ఫుల్ హీరోయిన్ పూనమ్ కౌర్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలైనా మంచి పేరే సంపాదించుకుంది. టాలీవుడ్ లో ‘మాయాజాలం’ సినిమాతో ఎంటరైన పూనమ్ ఆ తర్వాత తేజ దర్శకత్వం లో వచ్చిన ‘ఒక విచిత్రం’ సినిమాలో నటించి బాగానే పాపులర్ అయింది. అంతేకాదు వినాయకుడు.. నాగార్జున నటించిన ‘గగనం’ గోపీచంద్ నటించిన ‘శౌర్యం’ వెంకటేష్ నటించిన ‘నాగవల్లి’ సినిమాల తో పాటు ‘అటాక్’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలన్ని పూనమ్ కి చాలా మంచి పేరు తెచ్చాయి.

✅[310+] Poonam Kaur HD Wallpapers (Desktop Background / Android / iPhone)  (1080p, 4k) (1080x1303) (2020)

అయితే పూనమ్ కెరీర్ సినిమాల పరంగా కాస్త స్లో అవడంతో స్మాల్ స్క్రీన్ మీద ‘స్వర్ణ ఖడ్గం’ అనే సీరియల్ లో చేసింది. ఇక సినిమాల కంటే కూడా తన సెన్షేషనల్ కామెంట్స్ తోనే ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే కొన్ని సార్లు అవసరం లేకపోయిన ఏవో విషయాల మీద కామెంట్ చేస్తూ వార్తల్లో ఉంటుంది పూనమ్. ఈ క్రమంలో సినీ.. రాజకీయ అంశాలపైనా ఘాటుగా స్పందిస్తూ తనపైన నెగిటివ్ కామెంట్స్ చేసే వారిని వదలకుండా ఏకేస్తుంటుంది.

ఆ మధ్య టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి వల్లే తన జీవితం చిన్నా భిన్నం అయిందని తన వల్ల ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయానని .. పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్ట్రబ్ అయిందని వాపోయింది. అంతేకాదు ఒకరకంగా ఆ వ్యక్తి వల్లే ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని డిప్రెషన్ కి గురై సూసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చాయని సంచలనం రేపింది. ఇక ఈ మధ్య సైలెంట్ గా ఉన్న పూనమ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది.

పూనమ్ కౌర్ జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ‘నేను ఓ న్యాయవాదిని అయి ఎంతో పోరాడుదామని అనుకున్నాను. కానీ అది నెరవేరలేదు.. మనం అనుకున్నవన్ని జరగవు. మన లైఫ్ లో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని చెప్పుకొచ్చింది. ఏదేమైనా పూనమ్ లో కాస్త మార్పు కనిపిస్తుందని కొందరు మాట్లాడుకుంటున్నారట. ఇక అవకాశాలు వస్తే మళ్ళీ సినిమాలు చేస్తుందా లేదా అన్నది మాత్రం చెప్పడం లేదు పూనమ్ కౌర్.

Advertisement