Nani : నాని ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాల అప్డేట్స్ ఒకేసారి ఇవ్వబోతున్నాడు. గత ఏడాది వి సినిమాతో వచ్చి డిసప్పాయింట్ చేశాడు నేచురల్ స్టార్ నాని. అందుకే ఈసారి వరసగా సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అంతేకాదు ఒక్కో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా ఉన్నాడు. నిన్నుకోరి సినిమాతో నానికి సూపర్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ఈ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన శివ నిర్వాణ ఇప్పుడు నాని తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది.

ఇక ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. నాని కెరీర్ లో 26వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ‘టక్ జగదీష్’ మోషన్ పోస్టర్‌ను మరికొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు ఈ మోషన్ పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తారని సమాచారం.
Nani : నాని ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..!
అలాగే టాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని ‘శ్యామ్ సింగ రాయ్’ అన్న సినిమాలో నటిస్తున్నాడు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ ని జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. తాజాగా నాని ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇక ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.