రీసెంట్ గా అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా దియామీర్జా, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ నాగార్జున డేర్ డెవిల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మించగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం.
అయితే ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైల్డ్ డాగ్ సినిమాను కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే థియేటర్స్ ఓపెన్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు ప్రభుత్వం కఠిన నిబంధనల మధ్య 50 % ఆక్యుపెన్సీ తో సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చింది.
దాంతో థియోటర్స్ కూడా సిద్దమవుతున్నాయి. అయితే ఇప్పట్లో జనాలు థియేటర్స్ కి వచ్చే అవకాశాలు లేవన్న మాట వినిపిస్తోంది. అందుకే రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాని అనవసరంగా పరిస్థితులు చక్కబడే వరకు ఎదురు చూడకుండా అవకాశం ఉన్న ఓటీటీ లో రిలీజ్ చేసేస్తే మంచిదని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కథ బావుంటే సినిమా ఖచ్చితంగా సక్సస్ అవుతుందని రీసెంట్ గా సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా నిరూపించింది. అందుకే నాగార్జున కూడా వైల్డ్ డాగ్ ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.