Ravi teja : రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో మిరపకాయ్ 2..?

Ravi teja : రవితేజ..ఇటీవల క్రాక్ సినిమాతో మాస్ హిట్ అందుకొని మళ్ళీ తన సత్తా చాటాడు. భారీ హిట్ అందుకున్న రవితేజ మంచి మాస్ కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఖిలాడి సినిమాలో రవితేజ నటిస్తున్నాడు. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో అర్జున్, హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ కీలక పాత్రల్లో నటిస్తుండగా మే 28న రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.

is mirapakay 2 in raviteja - harish shanker combo...?
is mirapakay 2 in raviteja – harish shanker combo…?

Ravi teja : ఇటీవల ఉగాది రోజున రవితేజ తన కొత్త సినిమాని ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. ఈ సినిమాకి శరత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మజిలీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దివ్యాంశ కౌశిక్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో కూడా రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రకటన కూడా రావాల్సి ఉంది. ఇంతలోనే మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ravi teja : రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మిరపకాయ్ సీక్వెల్ ..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కి దర్శకుడిగా అవకాశం ఇచ్చింది ఆ తర్వాత హిట్ కొట్టే అవకాశం ఇచ్చింది మాస్ మహారాజానే. షాక్, మిరపకాయ్ సినిమాలో రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాగా మిరపకాయ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా వచ్చే అవకాశాలున్నట్టు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మరి ఆ సినిమా మిరపకాయ్ సీక్వెల్ అవుతుందా లేక కొత్త కథ అన్నది తెలియాల్సి ఉంది. త్వరలో హరీష్ శంకర్ .. పవర్ స్టార్‌తో సినిమా చేయబోతున్నాడు.

Advertisement