విక్రం మణిరత్నం సినిమానే హోల్డ్ లో పెట్టాడా ..?
Vedha - December 15, 2020 / 09:30 PM IST

విక్రం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు విక్రం సినిమాలకి నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే విక్రం కోసమే కథ లు సిద్దమవుతున్నాయి. ఒక సినిమా కమిటయ్యాడంటే ఆ సినిమా కోసం విక్రం ఎంతగా శ్రమిస్తాడో.. తనని తాను ఎంత కొత్తగా మలచుకుంటాడో ఇప్పటికే విక్రం చేసిన సినిమాలని చూస్తే అర్థమవుతుంది.
శివ పుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ వంటి సినిమాలు విక్రం కి ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చి పెట్టాయి. అపరిచితుడు సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి ఊహించని విధంగా అందరిలో క్రేజ్ ని దక్కించుకున్నాడు. కాగా విక్రం ఇప్పుడు నటిస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అలాగే మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసేందుకు విక్రం రెడీగా ఉన్నాడు. అందులో ఒక సినిమా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం.
మరొక సినిమా ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే తాజా సమాచారం మణిరత్నం, కార్తీక్ సుబ్బరాజు సినిమాలు ఇప్పుడు మొదలు పెట్టడానికి విక్రం సిద్దంగా లేడని తెలుస్తోంది. ముందు కమిటయిన దాని ప్రకారం జ్ఞాన ముత్తు దర్శకత్వంలో విక్రం నటిస్తున్న కోబ్రా సినిమానే పూర్తి చేయాలని డిసైడయ్యాడట. ఆ తర్వాతే మణి రత్నం పొన్నియన్ సెల్వం సినిమా కి డేట్స్ అడ్జెట్ చేయనున్నట్టు కోలీవుడ్ మీడియా సమాచారం. ఇక విక్రం కోబ్రాలో 8 రకాల విభిన్నమైన గెటప్ లలో కనిపించబోతున్నాడు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కార్తి, జయం రవి, విక్రం ప్రభు, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.