Malavika sharma : మాళవిక శర్మ …. టాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా ..?

Malavika sharma : మాళవిక శర్మ.. టాలీవుడ్ లో మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హాట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్న మాళవిక శర్మ అందరినీ ఆకట్టుకుంది. డాన్స్ ..పర్ఫార్మెన్స్ .. అందం.. అన్నిటిలోను మంచి మార్కులే పడ్డాయి. అయితే డెబ్యూ సినిమా డిజాస్టర్ కావడం మాళవిక శర్మ కి పెద్ద మైనస్ గా మారింది. నేల టికెట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే పలువురు టాలీవుడ్ మేకర్స్ డేట్స్ లాక్ చేసుకోవాలని భావించారు. నేల టికెట్ సినిమా టీజర్..ట్రైలర్ తో కూడా బాగా ఇంప్రెస్ చేసింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత మాళవిక శర్మ ని తలుచుకున్న వాళ్ళు లేరు.

అయితే రీసెంట్ గా ఎనర్జిటిక్ హీరో రాం పోతినేని హీరోగా వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్ గానే నిలిచింది. అయితే మాస్ మహారాజ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ సక్సస్ లో ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడిన వాళ్ళు లేరు. రాం కి రెడ్ హిట్ ఇచ్చినా రవితేజ .. క్రాక్ సినిమా గురించే అందరూ గొప్పగా చెప్పుకోవడం కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడం తో అందరు రెడ్ సినిమా సక్సస్ ని పట్టించుకోలేదు. అదే హీరోయిన్స్ గా నటించిన మాళవిక శర్మ ..నివేదా పేతురాజ్, అమృత రాయ్ లకి మైనస్ గా మారింది.

Malavika sharma : మాళవిక శర్మ కి రెడ్ సినిమా సక్సస్ ఏమంత కలిసి రాలేదనే చెప్పాలి.

మరీ ముఖ్యంగా మాళవిక శర్మ కి రెడ్ సినిమా సక్సస్ ఏమంత కలిసి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి తెలుగులో అవకాశాలేవీ లేవన్న మాట వినిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఉప్పెన సినిమాతో దూసుకొచ్చిన క్యూటీ కృతిశెట్టి వరసగా సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ పోటీని తట్టుకొని మాళవిక శర్మకి అవకాశాలు దక్కుతాయంటే కష్టమే అంటున్నారు. ఈ క్రమంలో మాళవిక శర్మ ఇక టాలీవుడ్ లో కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి లక్ కలిసి వచ్చి ఒక్క సినిమాలో ఛాన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంటే మళ్ళీ ఏదైనా స్టార్ తిరగొచ్చు.

Advertisement