Shruthi hassan : క్రాక్ కళ్యాణి కథ రాయనుందా..?

Shruthi hassan : శృతి హాసన్ నటుడైన కమల్ హాసన్ కూతురని అందరికి తెలుసు. కమల్ హాసన్ డైరెక్ట్ చేసిన హే రాం అనే సినిమా ద్వారా బాల్యనటిగా నటించింది. తర్వాత సంగీతం పై పట్టు సాధించింది. ఆ తర్వాత లక్, అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, ఇద్దరు మిత్రులు, గబ్బర్ సింగ్ మొదలగు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. తర్వాత రీసెంట్ గా రవితేజ క్రాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సాలీడ్ హిట్ అందుకుంది. శృతి హాసన్ మల్టీటాలెంటడ్ అన్న సంగతి తెలిసిందే.

is-krack-kalyani-going-to-write-a-story
is-krack-kalyani-going-to-write-a-story

తండ్రి వల్ల కాకుండా తన స్వశక్తి తో నిలదొక్కుకుంది. క్రాక్ సక్సస్ తర్వాత శృతి హాసన్ భారీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాలో, పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాల తో చాలా బిజీగా ఉంది. అలాగే తమిళ సినిమా కూడా చేతిలో ఉంది. ఇంత బిజీ షెడ్యుల్ లో కూడా తన లో దాగి ఉన్న మరో టాలెంట్ ని బయట పెట్టెందుకు ప్రయత్నిస్తుంది. అదేమిటంటే స్క్రిప్ట్ రాయడం. తను రాసిపెట్టుకున్న లైన్స్‌ని బౌండెడ్ స్క్రిప్ట్‌గా మార్చబోతోందట. జనరల్ గా అయితే ఒకరు ఒక పని చేసే సరికే తల ప్రాణం తోకకొస్తుంది. అలాంటిది ఒకేసారి రెండు మూడు పనులుచేయడానికి రెడి అయిపోతుంది.

Shruthi hassan : శృతి హాసన్ స్క్రిప్ట్ వర్క్, డైరెక్షన్ మీద దృష్టిపెట్టబోతుందా…?

సినిమా విషయానికొస్తే నిర్మాత, దర్శకుడు, నటీ నటులు, ఇతర టెక్నీషియన్స్ అందరు తమ తమ పనులు చేయడానికి ఎంత పక్కగా ప్లాన్ చేసుకున్నా కూడా సమయమే సరిపోవడంలేదని భావిస్తుంటారు. అలాంటిది ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూ, స్క్రిప్ట్ రాసుకుంటూ, డైరెక్షన్ కూడా చేయాలంటే ఈ పనులన్ని కత్తి మీద సాము వంటిదే. మరి స్టార్ హీరోయిన్‌గా ప్రస్తుతం మంచి ఫాంలో ఉండి కూడా స్క్రిప్ట్ వర్క్ మీద దృష్టిపెట్టబోతుందట శృతి హాసన్. మరి ఒక రచయితగా సక్సస్ సాధిస్తుందో లేదో అలాగే డైరెక్షన్ కూడా తనే చేసే ఆలోచన ఏమైనా ఉందో వేచి చూడాల్సిందే.

Advertisement