Keerthi suresh : కీర్తి సురేష్ హ్యాట్రిక్ మూవీతో పాన్ ఇండియన్ క్రేజ్ వచ్చేనా..?

Keerthi suresh : కీర్తి సురేష్ గత ఏడాది రెండు సినిమాలతో వచ్చి నిరాశ పరచిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయిన పెంగ్విన్, మిస్ ఇండియా భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ గా మిగిలాయి. దానికి తోడు అమ్మడు లాక్ డౌన్ సమయంలో బాగా సన్నబడి కాస్త నెగిటివ్ కామెంట్‌కు తావిచ్చింది. అయితే ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయకూడదని డిసైడయిందట. ఇక తాను నటించిన గుడ్ లక్ సఖీ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. టీజర్ వరకు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

is keerthi-suresh-gains pan indian range with hatric movie
is keerthi-suresh-gains pan indian range with hatric movie

దీని రిలీజ్ విషయంలో మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక ఈ ఏడాది వచ్చిన రంగ్ దే కూడా హిట్ టాక్ తెచ్చుకుంది గానీ ఫైనల్ రిజల్ట్ అంత ఆశాజనికంగా లేదనే చెప్పాలి. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట చేస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో ఆయనకి చెల్లెలి పాత్రలో కనిపించబోతోది. కథలో ఈ పాత్ర చాలా కీలకం కాబట్టే ఒప్పుకున్నట్టు కీర్తి చెప్పిందట. ఇది తప్ప తమిళంలో మరో సినిమా లేదనే సమాచారం.

Keerthi suresh : కీర్తి సురేష్‌ని ఫైనల్ చేసుకున్నారట.

అయితే విజయ్ తమిళం, తెలుగులో ఓ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే దీనికి దిల్ రాజు నిర్మాత. విజయ్‌కి తెలుగులో స్ట్రైట్ సినిమా కాగా ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఫైనల్ చేసుకున్నారట. ఇదే నిజమైతే విజయ్‌తో కీర్తి నటించే హ్యాట్రిక్ సినిమా అవుతుంది. అంతేకాదు పాన్ ఇండియన్ హీరోయిన్‌గానూ కీర్తి క్రేజ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. చూడాలి మరి కీర్తికి విజయ్ తో చేయనున్న హ్యాట్రిక్ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో.