Kajal Agarwal: కాజ‌ల్ ప్రెగ్నెన్సీ.. త్వ‌ర‌లో బేబీకి జ‌న్మ‌నివ్వ‌నుందా?

Kajal Agarwal: టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌.. గ‌త ఏడాది చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మ‌డు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కాజల్ వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌ను కూడా పక్కా ప్లాన్‌ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌తో ‘ఇండియన్‌-2’లో నటిస్తుంది ఈ భామ.

Is Kajal Agarwal Pregant Now.. will Deliver baby
Is Kajal Agarwal Pregant Now.. will Deliver baby

మ‌రోవైపు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో నాగ్ హీరోగా రూపొందే సినిమాలోను న‌టిస్తుంది కాజ‌ల్‌. ఇందులో స్పైగా కనిపిస్తూనే ఉగ్రవాదుల సీక్రేట్స్ తెలుసుకోడానికి వేశ్యగా కనిపించే పాత్ర చేస్తుంది. ఈ పాత్ర గురించి తెలుసుకున్న అభిమానులు షాక్ అయ్యారు. మ‌రో వైపు తన భర్త గౌతమ్ కిచ్లుకు కూడా సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటూ కాజల్ కోరుకుంటున్నట్లు తెలుస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ప్రెగ్నన్సీ గురించి వార్తలు వస్తున్నాయి. కాజల్ ప్రేగ్నంట్ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ ను పూర్తి చేసేసింది కాజల్. ది ఘోస్ట్ షూటింగ్ ను కూడా దాదాపుగా ఫినిష్ చేసింది. వీలైనంత త్వరలో తన షూటింగ్ కమిట్మెంట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి అని భావిస్తోంది. వీటి త‌ర్వాత కాజ‌ల్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనుంద‌ట‌.

అతి త్వ‌ర‌లో కాజ‌ల్ ఓ బేబికి జ‌న్మ‌నివ్వ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. తోటి హీరోయిన్ స‌మంత పెళ్లై నాలుగు ఏళ్లైన పిల్లలని ప్లాన్ చేయ‌కుండా కెరీర్‌లో దూసుకుపోతుండ‌గా, కాజ‌ల్ అప్పుడే ప్లాన్ చేస్తుంద‌నే దాంట్లో కొంత అనుమానం అయితే ఉంది. దీనిపై ఈ అమ్మ‌డు ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.

ప్ర‌స్తుతం కాజ‌ల్ తాను చేస్తున్న రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత కనీసం ఏడాదికి బ్రేక్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో నటిస్తానని సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది

తనకు ప్రపోజ్ చేయడానికి ముందే గౌతమ్ తన పేరెంట్స్ తో మాట్లాడి, వారిని పెళ్ళికి ఒప్పించి ఆ తరవాత తనకి ప్రపోజ్ చేసాడ‌ని, అది నాకు న‌చ్చి ఓకే చెప్పాను అని కొద్ది రోజుల క్రితం వెల్ల‌డించింది కాజ‌ల్ . తనకు లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టమని, అందుకే గౌతమ్‌తో లవ్ ప్రపోజ్ చేయించుకొని, పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వెల్లడించింది ఈ మిత్రవింద.