నితిన్ సినిమాకి కావాలనే బడ్జెట్ పెంచుతున్నారా ..?

నితిన్ కీర్తి సురేష్ జంటగా రంగ్ దే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ లిరికల్ సాంగ్ తో సినిమా మీద భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఈ ఏడాది భీష్మ తో మంచి సక్సస్ ని అందుకున్న నితిన్ ఈ సినిమాతో మరో హిట్ అందుకోబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీటయిన ఈ సినిమా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కోసం యూనిట్ దుబాయ్ వెళ్ళి చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Check Movie First Look Released By Koratala Siva » Indian News Live

కాగా ఈ సినిమా తో పాటు నితిన్ మరో సినిమాని చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని ‘భవ్య క్రియేషన్స్’ ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. ఈ సినిమా చదరంగం బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్ నటిస్తున్నాడని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాకి దాదాపు 35 కోట్ల బడ్జెట్ అయిందని .. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా ఎక్కువ బడ్జెట్ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే నితిన్ లాంటి సక్సస్ ఫుల్ అండ్ మినిమం గ్యారెంటీ హీరో మీద 35 కోట్ల బడ్జెట్ అన్నది చాలా రీజనబుల్ అని కొందరు మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు భారీ వసూళ్ళు కూడా రాబడుతుందని నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల రంగ్ దే సినిమాకి కాస్త బడ్జెట్ పెరిగిందన్న మాట వినిపించింది.

Advertisement