బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి ప్రభాస్ సినిమా కరెక్ట్ కాదా ..?

టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ మంచి క్రేజ్ ని సంపాదిచుకున్నాడు. ఈ యంగ్ హీరో గత చిత్రం మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించింది. దాంతో వరసగా సినిమాలు కమిటవుతున్నాడు. ఇప్పటికే అల్లుడు అదుర్స్ అన్న సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా నభా నటేష్, అనూ ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ .. సోనూ సూద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Bellamkonda is 'Alludu Adhurs' -

కాగా తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాని చేసేందుకు రంగం సిద్దమైంది. అది కూడా గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న హిందీ సినిమా. ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ని సిల్వర్ స్క్రీన్ కి హీరోగా పరిచయం చేసిన దర్శకుడు వి.వి.వినాయక్. అల్లుడు శీను అన్న టైటిల్ తో వచ్చిన ఆ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ డాన్స్ లోనూ .. ఫైట్స్ లోనూ.. ఎమోషన్స్ లోనూ శ్రీను బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నటించిన సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

Official: VV Vinayak to launch Bellamkonda Sreenivas in Bollywood with  Chatrapathi remake - tollywood

ఇక స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక, రీసెంట్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాక్షసుడు సినిమాల తో హిట్స్ అందుకున్నాడు శ్రీనివాస్. అయితే టాలీవుడ్ లో ప్రభాస్ నటించిన ఛత్రపతి హిందీ రీమేక్ లో నటించబోతున్నాడు శ్రీనివాస్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చి భారీ కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీమేక్ తో బెల్లంకొండ్ శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ చాలామంది కరెక్ట్ డెసిషన్ కాదన్నట్టుగా మాట్లాడుకుంటున్నారట.

బాలీవుడ్ లో డెబ్యూ సినిమా కాబట్టి అదే సినిమా టాలీవుడ్ లో కూడా రిలీజైతే పాన్ ఇండియన్ రేంజ్ ఉండేదని అంటున్నారట. అయితే ఛత్రపతి సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా కాబట్టి మళ్ళీ ఈ సినిమాని ఇక్కడ రిలీజ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ అన్నది రాంగ్ డెసిషన్ అని అంటున్నట్టు ఫిల్మ్ నగర్ లో చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.

Advertisement