ఇలాంటి కథ తో కోన వెంకట్ బాలయ్యని ఒప్పించాడంటే గొప్పే ..?

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని ద్వారక క్రియోషన్స్ పతాకం పై మిరియాల రవీందెర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక బాలయ్య, బోయపాటికి గత చిత్రం ఫ్లాప్ గా మిగలడం తో ఈసారి భారీ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు బోయపాటి.

BB3 teaser out: Balakrishna roars in new film with Boyapati Srinu. Watch -  Movies News

ఆ రకంగానే భారీ లేవల్ లో బాలయ్యని చూపించబోతున్నాడు. ఇప్పటికే బిబి3 ఫస్ట్ రోర్ సినిమా మీద భారీ అంచనాలను నెలకొల్పింది. కాగా ఈ సినిమా తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే పలువురు దర్శకుల పేర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. బాలయ్య కి భారీ హిట్స్ ఇచ్చిన బి గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం అవుతోంది.

ఇక సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు ఆ మధ్య బాగా ప్రచారం అయింది. కాగా తాజా సమాచారం ప్రకారం ప్రముఖ రచయిత కోన వెంకట్ బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ మాస్ ఎంటర్ గా ఉండే కథ ని సిద్దం చేసినట్టు.. ఆ కథ బాలయ్యకి బాగా నచ్చడం తో ఒకే చెప్పినట్టు సమాచారం. కాగా ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ఇంతకముందు బాలయ్య – శ్రీవాస్ కాంబినేషన్ లో డిక్టేటర్ అన్న సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు మొదలవబోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఒక అద్భుతమైన కథ ని సెలెక్ట్ చేసి పెట్టాడట బాలయ్య.

 

 

 

Advertisement