బెల్లం కొండ శ్రీనివాస్ – వినాయక్ ల మధ్య ఉన్న రిలేషన్ ఛత్రపతి సినిమాతో బయట పడిందా ..?

బెల్లంకొండ శ్రీనివాస్ ని సిల్వర్ స్క్రీన్ కి హీరోగా పరిచయం చేసిన దర్శకుడు వి.వి.వినాయక్. ఈ సినిమాలో మంచి మాస్ హీరోగా ప్రజెంట్ చేశాడు. మొదటి సినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్ డాన్స్ లోనూ .. ఫైట్స్ లోనూ.. ఎమోషన్స్ లోనూ శ్రీను బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నటించిన సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక, అలాగే రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాక్షసుడు సినిమాల తో మంచి హిట్స్ అందుకున్నాడు.

5 reasons why Bellamkonda Sreenivas-Anupama Parameswaran's Rakshasudu  cannot be missed | Bollywood Life

కాగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా టాలీవుడ్ లో ప్రభాస్ నటించగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చి భారీ కమర్షియల్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాతో. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తుండగా ప్రభాస్ పోషించిన పాత్రని బెల్లంకొండ శ్రీనివాస్ పోషించబోతున్నాడు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నది మాత్రం గత కొన్ని రోజులుగా సస్పెన్స్ గా మారింది.

Official: VV Vinayak to launch Bellamkonda Sreenivas in Bollywood with  Chatrapathi remake - tollywood

ముందు కొన్ని రోజులు సాహో ఫేం సుజీత్ ఈ సినిమాని దర్శకత్వం వహించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కాని స్వయంగా సుజీత్ ఈ సినిమా చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభుదేవా పేరు వార్తల్లో నిలిచింది. కాని అందులో కూడా నిజం లేదని మళ్ళీ వార్తలు వచ్చాయి.

కాగా ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నట్టు ప్రకటించారు. వినాయక్ కి బాలీవుడ్ లో ఇది మొదటి సినిమా అయినప్పటికి ఇంతకు ముందు టాలీవుడ్ లో వినాయక్ తెరక్కించిన సినిమాలు బాలీవుడ్ లో డబ్ అయ్యాయి. ఆ రకంగా బాలీవుడ్ ప్రేక్షకుల్లో వినాయక్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాకి వినాయక్ ని ఎంచుకున్నారట. ఇక పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని సమాచారం. ఇక బెల్లంకొండ శ్రీను అంటే వినాయక్ కి ప్రత్యేకమైన అభిమానం ఉండబట్టే ఈ సినిమా ఒప్పుకున్నాడని అంటున్నారు.

Advertisement