Sarkaru vari pata : సర్కారు వారి పాట టీజర్ రావడం డౌటా..?

Sarkaru vari pata : సర్కారు వారి పాట..సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో నటిస్తున్న 27వ చిత్రం. యూనివర్సల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పరశురాం పెట్లా తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్లో 25 శాతం చిత్రీకరణ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. 25 రోజుల టాకీపార్ట్ కంప్లీట్ చేయాలని చిత్ర షూటింగ్ మొదలు పెట్టారు. కానీ యూనిట్ సభ్యులలో 5 మందికి కరోనా సోకడంతో నిలిపివేశారు.

is it doubt regarding Sarkaru vari pata teaser
is it doubt regarding Sarkaru vari pata teaser

కాగా ఈనెల 31న మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట నుంచి టీజర్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ 25 పర్సెంట్ షూటింగ్ పూర్తయింది కాబట్టి అందరూ చాలా నమ్మకంగా టీజర్ రెడీ అవుతుందని సర్‌ప్రైజ్ రావడం గ్యారెంటీ అని మాట్లాడుకుంటున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు టీజర్ కాకుండా మోషన్ పోస్టర్ వచ్చే వీలుందని అంటున్నారు. టీజర్ ఎందుకు రెడీ కాలేదన్నది క్లారిటీ లేదు.

Sarkaru vari pata : టీజర్ వచ్చినా రావచ్చు అనే మాటా కుడా వినిపిస్తోంది.

అయితే ఆ సమయానికి టీజర్ వచ్చినా రావచ్చు అనే మాటా కుడా వినిపిస్తోంది. వస్తే మాత్రం మహేష్ బాబు అభిమానులకే కాదు కామన్ ఆడియన్స్‌లో ఉండే ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. ఇక ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైన్మెంట్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2022 సంక్రాంతికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు – మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కబోతోంది.