Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా వల్ల ఎన్టీఆర్ సినిమా ఆగిందా..?

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా వల్ల ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఆగిపోయిందా.. ప్రస్తుతం ఇదే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోందట. వాస్తవంగా ఎన్టీఆర్ – మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ 30 తెరకెక్కాల్సింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ రూపొందుతుందని అనౌన్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ చిత్ర బృందం అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ప్రచారం చేశారు.

is it because of pawan-kalyan-ntr movie stopped...?
is it because of pawan-kalyan-ntr movie stopped…?

అందుకు కారణం అరవింద సమేత వీర రాఘవ సినిమా. తారక్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాలో తారక్‌ని త్రివిక్రం కొత్తగా చూపించాడు. దాంతో మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీటవుతుందనగానే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయింది. ఇటీవలే ఇందుకు సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి. త్రివిక్రం ప్లేస్ లో సక్సస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ వచ్చి చేరాడు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాకి త్రివిక్రం దర్శకుడు కాడు..!

ఇక ఎన్టీఆర్ 30 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతుండగా నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాని నిర్మించనున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో పొల్టికల్ బ్యాగ్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ – త్రివిక్రం సినిమా క్యాన్సిల్ అవడానికి పవన్ కళ్యాణ్ నటిస్తున్న మలయాళ సినిమా తెలుగు రీమేక్ కారణమని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట. ఈ సినిమాకి త్రివిక్రం దర్శకుడు కాకపోయినా స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ అందిస్తున్నాడు. పవన్ సినిమా కాబట్టి ఎక్కువ ఫోకస్ ఈ సినిమా మీద పెట్టడం వల్లే తారక్ సినిమా ఆగిందన్న మాట వినిపిస్తోంది.

Advertisement