Raviteja : రవితేజ క్రాక్ హిందీలో చేస్తున్న హీరో మారాడా..?

Raviteja : రవితేజ క్రాక్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. మూడేళ్ళుగా సక్సస్ లకి దూరంగా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. లాక్ డౌన్ తర్వాత 50 పర్సెంట్ ఆక్యూపెన్సీ తో కూడా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. చెప్పాలంటే రవితేజ తేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా క్రాక్ సినిమా నిలిచింది.

is hero changed in  raviteja krack movie...?
is hero changed in raviteja krack movie…?

సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలతో పోటీ పడిన ఈ సినిమా అన్ని సినిమాలను దాటుకొని భారీ హిట్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ కి వెళుతుందని వార్తలు వచ్చాయి. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నారని … బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ సినిమా రీమేక్ లో న్యూస్ వైరల్ నటించబోతున్నాడని న్యూస్ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం క్రాక్ సినిమా లో అజయ్ దేవగన్ నటించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

Raviteja : ఖిలాడి సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అజయ్ దేవగన్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కారణంగా అజయ్ దేవగన్ ప్లేస్ లో రణ్ వీర్ సింగ్ నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఒకవేళ డేట్స్ గనక సర్దుబాటు అయితే అజయ్ దేవగన్ నటిస్తాడట. లేదా రణ్ వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటరవుతాడని క్లారిటీ వచ్చింది. కాగా రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

Advertisement