Drishyam 2 : దృశ్యం 2 హిందీలో ప్లాన్ చేస్తున్న అజయ్ దేవగణ్..?

Drishyam 2 : దృశ్యం ..మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలలో నటించగా తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. కాగా రీసెంట్ గా దృశ్యం మూవీ సీక్వెల్ దృశ్యం 2 కూడా తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఈ సీక్వెల్ సినిమాలో కూడా వెంకటేష్, మీనా కలిసి నటించబోతున్నట్లు సమాచారం. మలయాళంలో కూడా సూపర్ స్టార్ మోహన్ లాల్ మీనా కలిసి నటించి మెప్పించారు.

is-drushyam-2-planned-by-ajaydevagan-in-hindi
is-drushyam-2-planned-by-ajaydevagan-in-hindi

అలాగే దృశ్యం-2 కూడా ఎంతో ఉత్కంఠతను ప్రేక్షకులలో నింపుతుందని అందరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మొదటి సినిమాకు సీక్వెల్ గా దృశ్యం-2 గా రూపొంది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన అటు ప్రేక్షకులని ఇటు క్రిటిక్స్ ని మెప్పించడమే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉండగా దృశ్యం హిందీ రీమేక్ లో స్టార్ హీరో అజయ్ దేవగన్, శ్రీయ శరన్, టబు ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం దృశ్యం-2 ని కుడా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావిస్తున్నారట. దృశ్యం-2 హిందీ రీమేక్ రైట్స్ అజయ్ దేవగణ్ ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ కలిసి కొనుగోలు చేసినట్టు సమాచారం. అజయ్ దేవగన్ కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాక ‘దృశ్యం-2’ ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది.

Drishyam 2 : దృశ్యం-2 ని నిశికాంత్ కామత్ తెరకెక్కించడం లేదు..!

అయితే ‘దృశ్యం’ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నిశికాంత్ కామత్ దృశ్యం-2 ని తెరకెక్కించడం లేదు. అందుకు కారణం డైరెక్టర్ నిశికాంత్ కామత్ 2019లో మరణించాడు. అందుకే డైరెక్టర్ నిశికాంత్ కామత్ స్థానంలో సుజయ్ ఘోష్ దృశ్యం-2 సినిమాని తెరకెక్కిస్తాడని బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో మరో మాట కూడా వినిపిస్తోంది. మలయాళం దృశ్యం-2 ని తెరకెక్కించిన డైరెక్టర్ జీతూనే తెలుగు తో పాటు హిందీ సీక్వెల్స్ ని తెరకెక్కిస్తాడని చెప్పుకుంటున్నారు. కాగా ఈ సీక్వెల్స్ అటు తెలుగులో ఇటు హిందీలో తెరకెక్కడానికి కాస్త సమయం పడుతుందని అంటున్నారు. అందుకు కారణం ఇక్కడ వెంకటేష్ అక్కడ అజయ్ దేవగణ్ వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటమే.

Advertisement