Dil raju : దిల్ రాజు రూల్స్ బ్రేక్ చేశాడు.. తర్వాత పరిస్థితులన్నీ మారడం ఖాయమా..?

Dil raju : దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ సినిమాని నిర్మించి తన 22 ఏళ్ళ కల నెరవేర్చుకున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమా చేయడం దిల్ రాజుకి పెద్ద పనేం కాదు. డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజు కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా మారాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని అందించాడు. దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులందరు ఎంతో ఆతృతగా ఎదురు చూసేలా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా మేకర్స్ కూడా దిల్ రాజు సినిమా మీద ఆసక్తి చూపిస్తుంటారు.

is dil-raju-has broken the rules...?
is dil-raju-has broken the rules…?

ఇక ఎంతో మందికి దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా రోల్ మోడల్. తనెప్పుడు ఒకరికి చెప్పే స్థాయిలోనే ఉంటాడు. అయితే తప్పని పరిస్థితుల్లో రూల్స్ బ్రేక్ చేశాడు. ఏ సినిమా అయినా థియేటర్ రిలీజ్ తర్వాత కొన్ని నెలలు వరకు శాటిలైట్ రిలీజ్ గానీ, డిజిటల్ రిలీజ్ గానీ చేయకూడదు. అయితే ఇండస్ట్రీలో చాలామంది ఈ రూల్ ఎప్పుడో బ్రేక్ చేశారు. ఇది చాలా వరకు వసూళ్ళ మీద హీరోల మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశాలుంటాయని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయినా దీనికి అడ్డుకట్ట వేయడం లేదు.

Dil raju : దిల్ రాజు అప్పుడు చెప్పిన మాట వేరే.

అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాని థియేటర్స్ లో రిలీజైన 21 రోజులకే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు అధికారకంగా ప్రకటించాడు. ఇటీవలే ఈ విషయంలో సోషల్ మీడియాలో వార్తలు రాగా అప్పుడు దిల్ రాజు చెప్పిన మాట వేరే. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 రోజుల తర్వాతే వకీల్ సాబ్ ఓటీటీలో వస్తుందని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు సడన్‌గా ఇలా ఏప్రిల్ 30న వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించడంతో కొందరు మీకు ఏ రూల్స్ ఉండవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement