అనుష్క శెట్టి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా .. మాకు తెలీయదే ..?
Vedha - January 12, 2021 / 12:46 PM IST

అనుష్క శెట్టి సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ న్యూస్ అనుష్క శెట్టి నటించబోయే నెక్స్ట్ సినిమా గురించి. భాగమతి తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుష్క కి మంచి హిట్ ఇచ్చింది. బాహుబలి, భాగమతి సినిమాలతో సక్సస్ లను అందుకున్న అనుష్క శెట్టి ఆ తర్వాత నిశ్శబ్ధం సినిమా చేసింది. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ నిర్మించాడు.
మాధవన్, అంజలి, శాలినీ పాండే కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన నిశ్శబ్ధం భారీ అంచనాలతో థియేటర్స్ ఓపెన్ కాకపోయినా ఓటీటీలో రిలీజ్ చేశారు. అన్ని అంచనాల మధ్య రిలీజైన అనుష్క శెట్టి నిశ్శబ్ధం ఫ్లాప్ సినిమాగా మిగిలింది. దాంతో అభిమానులు ఎంత డిసప్పాయింట్ అయ్యారో అనుష్క కూడా అంత డిసప్పాయింట్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే కొత్త సినిమాని ప్రకటిస్తుందనుకున్న ఫ్యాన్స్ కి ఎదురు చూపులే మిగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా.. ఆ సినిమా అంటూ ప్రచారం జరిగింది. ఆఖరికి గుణశేఖర్ శాకుంతలం లో నటించేది అనుష్కనే అని వార్తలు వచ్చాయి.
కాని శాకుంతలం లో సమంత ని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కాగా తాజాగా అనుష్క రారా కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా మారిన పి.మహేష్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని అనుష్క కోన వెంకట్ వల్ల ఒప్పుకుందని న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇది పూర్తిగా రూమర్ అని తెలుస్తోంది. అసలు అనుష్క ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవలేదని సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం. అంతేకాదు ఈ న్యూస్ తెలిసి మాకు తెలియకుండా అనుష్క శెట్టి సినిమా ఎప్పుడు కమిటయిందని అంటున్నారట.