Ananya nagalla : అనన్య నాగళ్ళ గ్లామర్ తో నెట్టుకొస్తుందా..?

Ananya nagalla : అనన్య నాగళ్ళ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రల్లో కనిపించగా .. నివేథా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో నటించారు. అయితే ముగ్గురు అమ్మాయిలలో అనన్య బాగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం యూత్ లో అనన్య కి మంచి క్రేజ్ వచ్చేసింది. ఈ క్రేజ్ తో టాలీవుడ్ లో అనన్య మరిన్ని అవకాశాలు అంది వస్తున్నాయట.

 is ananya-nagalla glamour plus for her
is ananya-nagalla glamour plus for her

అవార్డ్ విన్నింగ్ సినిమా మల్లేశంతో టాలీవుడ్‌కి పరిచయం అయింది తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ. కమెడియన్ ప్రియదర్శి కి జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణలోని ఖమ్మం ప్రాంతానికి చెందిన అనన్య నాగళ్ళ బీ-టెక్, ఎల్ ఎల్ బి చేసింది. అయితే సినిమాల మీద ఆసక్తితో హీరోయిన్ గా ప్రయత్నాలు చేసి మల్లేశం లో అవకాశం అందుకుంది. మొదటి సినిమాకి అవార్డ్ రావడంతో అనన్య మీద టాలీవుడ్ మేకర్స్ దృష్ఠి పడింది. దర్శకుడు అనన్య కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. పవర్ స్టార్ సినిమా .. మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా. అన్నీ రకాలుగా అనన్య కి ఈ సినిమా బాగా కలిసి వచ్చింది.

Ananya nagalla : అనన్య నాగళ్ళ మీద ఫోకస్ బాగా పడుతుందంటున్నారు.

వకీల్ సాబ్ రిలీజయ్యాక కథ ముగ్గురమ్మాయిల చుట్టునే తిరగడం..వారి పర్ఫార్మెన్స్ బాగా జనాలను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే అనన్యకి మీడియం బడ్జెట్ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయట. అనన్య కూడా వకీల్ సాబ్ సినిమాతో వచ్చిన క్రేజ్ తో… సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ టాలీవుడ్ మేకర్స్ దృష్ఠిని ఆకట్టుకోవడమే కాదు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కాస్త హాట్ ఫొటోస్ తో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది అనన్య. ప్రస్తుతం ఈ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. దాంతో తెలుగందం మీద ఫోకస్ బాగా పడుతుందంటున్నారు.

Advertisement