Mahesh : మహేష్ కి విలన్‌గా యక్షన్ కింగ్..?

Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యూనివర్సల్ కథాంశంతో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు తర్వాత రాబోతున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరి హాట్ టాపిక్ గా నిలిచిన పరశురాం పెట్లా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఉన్న మెయిన్ విలన్ రోల్ లో నటించే నటుడు గురించి రక రకాల వార్తలు వస్తున్నాయి.

is action king as mahesh-villan...?
is action king as mahesh-villan…?

కానీ అధికారకంగా మాత్రం ఎవరినీ ఫైనల్ చేయలేదు. సోనుసూద్ ను అనుకున్న చిత్ర బృందం ప్రస్తుతం ఆయనకి ప్రజల్లో పెరుగుతున్న ఫాలోయింగ్ దృష్ఠిలో పెట్టుకొని విలన్ రోల్ అయితే సమస్యలు వస్తాయని ఆడియన్స్ రిసీవింగ్‌లో తేడా కొడుతుందని భావించి వద్దనుకున్నారట. ఆ తర్వాత అరవింద స్వామి, విజయ్ సేతుపతి సహా పలువురు బాలీవుడ్ నటులను పరిశీలించినట్టు తెలుస్తోంది. కానీ ఫైనల్ గా సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ ఓకే చేసినట్టు తాజా సమాచారం.

Mahesh : సర్కారు వారి పాటలో విలన్ గా అర్జున్..?

ఇప్పటికే అర్జున్ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు ఒప్పుకుంటున్నాడు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చేసి ఆకట్టుకున్న అర్జున్ ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడిలో విలన్ పాత్ర చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాటలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇంకా కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రైజ్ రావాల్సి ఉండగా కరోనాతో ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అప్‌డేట్ ప్లాన్ చేయడం లేదని అఫీషియల్ గా మెకర్స్ వెల్లడించారు.