న‌టుడిగా మారిన క్రికెట‌ర్‌.. ఫ‌స్ట్ లుక్‌లో కిరాక్ పుట్టిస్తున్న ఆల్‌రౌండ‌ర్

Samsthi 2210 - October 28, 2020 / 02:10 PM IST

న‌టుడిగా మారిన క్రికెట‌ర్‌.. ఫ‌స్ట్ లుక్‌లో కిరాక్ పుట్టిస్తున్న ఆల్‌రౌండ‌ర్

ఆల్‌రౌండర్‌గా భార‌త్‌కు ఎన్నో విజ‌యాలందించిన ఇండియన్ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇప్పుడు న‌టుడిగా మారారు. ‘డిమోంటి కాలనీ’ ఫేమ్‌ అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ ‘కోబ్రా’ అనే మూవీలో విక్ర‌మ్ న‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఇర్ఫాన్ 36వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర బృందం ఆయ‌న లుక్‌ని విడుద‌ల చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ‘డియర్‌ ఇర్ఫాన్ సార్‌ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.

మీలాంటి గొప్ప వ్య‌క్తితో క‌లిసి ప‌ని చేసినందుకు సంతోషంగా ఉంది.హ్యాపీ బర్త్‌డే అస్లాన్‌ యిల్మాజ్‌’ అంటూ ఆయన ట్వీట్‌ చేశాడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు. ఫ‌స్ట్ లుక్‌లో ఇర్ఫాన్ ఖాన్ బ్లాక్ సూట్‌లో చాలా సీరియ‌స్‌గా చూస్తూ క‌నిపించారు. ఫ్రెంచ్‌ ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్ అస్లాన్‌ యిల్మాజ్‌గా కోబ్రా మూవీలో ఆయ‌న క‌నిపించ‌నున్నారు. ఆ మధ్య సెట్‌లో ఇర్పాన్ ఖాన్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు విడుద‌ల కాగా, ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ఖాన్ ..కోబ్రా సినిమాతో వెండితెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. కోబ్రా చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండ‌గా, ఈ మూవీలో విక్రమ్‌ ఏడు పాత్రల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సర్‌జానో, కేఎస్‌ రవికుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియోస్‌, వియకామ్‌ 18 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా, భార‌త క్రికెట్ స్పిన్న‌ర్ హార్భ‌జ‌న్ సింగ్ కూడా వెండితెర ఆరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్రెండ్ షిప్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.యాక్ష‌న్ హీరో అర్జున్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us