ఐపీఎల్ లో బోణి కొట్టిన చెన్నై

Advertisement

ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా నిన్న మొదలయ్యింది. ఇక మొదటి మ్యాచ్ చెన్నై, ముంబై జట్టులు తలపడ్డాయి. ఇక ఈ మ్యాచ్ లో ముంబై జట్టుపై చెన్నై జట్టు విజయం సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు 162 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. ఇక ముంబై లక్ష్యాన్ని చెన్నై 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంబటి రాయుడు(71), డుప్లెసిస్‌(58) అర్ధ శతకాలతో చెన్నై జట్టు విజయం సాధించడంలో కీలకంగా ఉన్నారు.

ఇక ముంబై బ్యాటింగ్ వివరాల్లోకి వెళితే సౌరభ్‌ తివారి(42), క్వింటన్‌ డికాక్‌(33) పరుగులు చేశారు. ఇక తొలి వికెట్‌కు డికాక్ ‌తో కలిసి రోహిత్ శర్మ‌(12) 46 పరుగులు జోడించాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. జడేజా, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు తీశారు. అలాగే సామ్ ‌కరన్‌, పీయుష్‌ చావ్లా చెరో వికెట్‌ తీశారు. ఇక ముంబయి బౌలర్లలో ట్రెంట్‌బౌల్ట్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్య, పాటిన్ ‌సన్‌, రాహుల్‌ చాహర్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here