Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్‌కి గ‌ట్టిగా త‌గిలిన ఐపీఎల్ దెబ్బ‌.. టీఆర్పీ రేటింగ్స్ ఢ‌మాల్

Evaru Meelo Koteeswarulu: బుల్లితెర‌పై బిగ్ బాస్ షోతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్యక్ర‌మంతో అల‌రిస్తున్నారు. ఈ షో ద్వారా భారీ రేటింగ్‌ని రాబ‌ట్టాల‌ని జెమినీ వారు ప్ర‌య‌త్నిస్తుండ‌గా, వారికి నిరాశే ఎదుర‌వుతుంది. మొదటి రెండు ఎపిసోడ్ ల్లో రామ్ చరణ్ కనిపించడం వల్ల ప్రేక్షకులు పెద్ద ఎత్తున చూశారు. ఆ తర్వాత నుండి కాస్త రేటింగ్ తగ్గింది.

IPL Effected NTRR's Evaru Meelo Koteeswarulu Show TRP Ratings
IPL Effected NTRR’s Evaru Meelo Koteeswarulu Show TRP Ratings

రెండో వారం రేటింగ్ కాస్త పెరిగింది. మ‌ధ్య‌లో కొర‌టాల శివ‌, రాజ‌మౌళి రావ‌డంతో ఇంకొంత రేటింగ్ పెరిగింది. మూడు వారాల్లో వరుసగా వారం వారం రేటింగ్ పెరగడంతో మరింతగా రేటింగ్ పెరగుతుందని భావించిన సమయంలో అనూహ్యంగా తాజా వీక్ రేటింగ్ తగ్గినట్లుగా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ మానియా పని చేయడం లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఐపీఎల్ ఎఫెక్ట్ పడిందని అంటున్నారు.

ఐపీఎల్ ఈ ఏడాది సెకండ్ ఫేస్ మ్యాచ్‌ల‌ని యూఏఈలో నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రారంభం అయిన ఈ ఐపీఎల్ మ్యాచ్ లకు విపరీతమైన రేటింగ్ దక్కుతుందట. యువత ఎవరు మీలో కోటీశ్వరులు చూసేవారు.. ఇప్పుడు వారే ఐపీఎల్ ను చూస్తున్నట్లుగా సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది. ఐపీఎల్ దెబ్బకు బిగ్ బాస్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా స్టార్ మా వర్గాల ద్వారా కూడా సమాచారం అందుతోంది.

ద‌స‌రాకు మ‌హేష్ చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్ షో ఉండ‌నుంది. ఆ షోతో భారీ టీఆర్పీ రేటింగ్ రాబ‌ట్టాల‌ని భావిస్తున్నారు.ఆ త‌ర్వాత ప్ర‌భాస్‌ని కూడా తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. ఏదేమైన ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఐపీఎల్ దెబ్బ గట్టిగా పడింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ వల్ల షోని చూస్తున్నార‌ని చెబుతున్నారు.