IPL: ధోనిపైన ఆధార‌ప‌డ్డ రైనా ఐపీఎల్ భ‌వితవ్యం..!

IPL:భార‌త క్రికెట్‌కు ఎన్నో మ‌ర‌పురాని విజ‌యాలు అందించిన స్టార్ ఆటగాళ్ల‌లో ధోని, రైనా త‌ప్ప‌క ఉంటారు. ఈ ఇద్ద‌రు క్రీజులో పాతుకు పోయారంటే ప్ర‌త్యర్ధి బౌల‌ర్స్‌కి దడ పుట్టాల్సిందే. ఐపీఎల్‌లోను చెన్నై టీంకు కలిసి ఆడుతున్న ధోని, రైనా మంచి స్నేహితులుగా కూడా ఉన్నారు. వారి మ‌ధ్య ఉన్న స్నేహం కారణంగానే ధోని రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన వెంట‌నే రైనా కూడా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టు చెప్పుకొచ్చాడు.

గతేడాది స్వాత్రంత్య దినోత్సవం రోజున ధోనీ- సురేశ్ రైనా క్రికెట్ అభిమానులకు ఊహించని షాకిచ్చారు. అనూహ్యంగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన‌ క్షణాల వ్యవధిలో ఆటకి రిటైర్మెంట్ ప్రకటించాడు రైనా. కెరీర్ అసాంతం నన్ను ప్రేమించి మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి అని ఓ వీడియోను ధోనీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ధోనీతో ఆడటం తనకెంతో సంతోషంగా ఉందని ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెప్పిన సురేష్ రైనా ధోనీ ప్రయాణంలో తాను కూడా తోడుగా ఉండదలచుకున్నానని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ఇక రీసెంట్‌గా ధోని బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ఓ వీడియో షేర్ చేసిన రైనా అందులో నాకు మిత్రుడు, సోదరుడు, మార్గనిర్దేశకుడు. మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప ఆటగాడిగా నాయకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. అయితే వ్యక్తిగత కారణాలతో గత ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా.. 2021 మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటాడు.

గ‌త కొద్ది రోజులుగా ధోని ఐపీఎల్ కెరీర్‌పై కూడా సందిగ్ధం నెలకొంది. ఈ సీజ‌న్ ధోనికి చివ‌రి ఐపీఎల్ అంటూ ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రైనా స్పందించారు. నాకు మ‌రో నాలుగేళ్లు ఐపీఎల్ ఆడే అవ‌కాశం ఉంది. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు సీఎస్‌కే తోనే ఉండాల‌ని అనుకుంటున్నాను. ఈ ఏడాది మేం అద్భుతంగా రాణిస్తాం . ధోనీ భాయ్ వచ్చే ఏడాది ఐపీఎల్ లో ఆట ఆడకపోతే నేను కూడా ఐపీఎల్ నుండి తప్పుకుంటా.

2008 నుండి ధోనితో క‌లిసి సీఎస్కేకు ఆడుతున్నాను. ఈ ఏడాది మేం టైటిల్ గెలిస్తే వ‌చ్చే సీజ‌న్ ఆడేలా ధోని బాయ్‌పై ప్రెషర్ తెస్తాను. ఒక‌వేళ అత‌ను ఆడ‌క‌పోతే నేను త‌ప్పుకుంటాను. నాకు అదే ఐపీఎల్ సీజ‌న్ చివ‌రిది అవ‌తుంది అని రైనా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ధోని రిటైర్‌మెంట్‌పై సీఎస్కే కూడా స్పందించింది. మ‌రో రెండేళ్ల పాటు సీఎస్కేకు ధోనినే కెప్టెన్‌గా ఉంటార‌ని పేర్కొంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.