IPL-14 Match-9 : హైదరాబాద్ కి విక్టరీ.. మూడో‘‘సారీ’’

IPL-14 Match-9 : ఇవాళ శనివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోని 9వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించారు. 13 పరుగుల తేడాతో నెగ్గారు. ఇది ముంబైకి రెండో విజయం కాగా హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలైంది. ఇవాళ్టి మ్యాచ్ లో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 137 రన్నులకే ఆలౌట్ అయ్యారు. 151 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ 36, జానీ బెయిర్ స్టో 22 బంతుల్లోనే 43, మనీశ్ పాండే 2, విరాట్ సింగ్ 11, విజయ్ శంకర్ 28, అభిషేక్ శర్మ 2, అబ్దుల్ సమద్ 7 రన్నులు చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్ ఛాహర్, బ్రెంట్ బౌల్ట్ 3 చొప్పున, కృనాల్ పాండ్య, బుమ్రా ఒకటి చొప్పున వికెట్లు పడగొట్టారు.

ఆశ్చర్యం.. టాస్ గెలిచి బ్యాటింగ్

ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఇది మూడో మ్యాచ్. ముంబై ఒక్క విజయాన్ని మాత్రమే అందుకోగా హైదరాబాద్ కి అది కూడా లేదు. ఆడిన రెండు మ్యాచ్ లూ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ శనివారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు జరగ్గా టాస్ గెలిచిన ప్రతి జట్టూ ముందుగా ఫీల్డింగ్ నే సెలెక్ట్ చేసుకున్నాయి. ఈ ట్రెండ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ముంబై ఇండియన్స్ ఈరోజు టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ని ఎంచుకోవటం ఆశ్చర్యం కలిగించింది.

టార్గెట్ 151: IPL-14 Match-9

ముంబై ఇండియ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి 151 పరుగుల తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించారు. 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లు కోల్పోయి 150 రన్నులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డీకాక్, కెప్టెన్ రోహిత్ శర్మ శుభారంభం చేసినా తర్వాత వచ్చినోళ్లు వాడుకోలేకపోయారు. డీకాక్ 40, రోహిత్ శర్మ 32, పోలార్డ్ 35, సూర్యకుమార్ యాదవ్ 10, ఇషాన్ కిషన్ 12, హార్దిక్ పాండ్య 7, కృనాల్ పాండ్య 3 పరుగులు సాధించారు. హైదరాబాద్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్, విజయ్ శంకర్ రెండు చొప్పున, కలీల్ అహ్మద్ ఒక వికెట్ నేలకూల్చారు.

IPL-14 Match-9 : mumbai team won the match on hyderabad
IPL-14 Match-9 : mumbai team won the match on hyderabad

Advertisement