IPL-14 Match-8 : ‘పంజాబ్’పై ఛాహర్ పంజా.. చెన్నై సింపుల్ గా..

IPL-14 Match-8 : ది గ్రేట్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కి మొత్తానికి తొలి విజయం లభించింది. రెండో మ్యాచ్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్ పై సునాయాసంగా నెగ్గింది. అతి చిన్న లక్ష్యాన్ని అవలీలగా అందుకుంది. 26 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 6 వికెట్ల తేడాతో విజయ తీరానికి చేరింది. 107 రన్నుల టార్గెట్ ఛేదించేందుకు రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులకే ఔట్ అయ్యాడు. తర్వాత డూప్లెసిస్, మోయీన్ అలీ మరో వికెట్ పడకుండా చక్కగా ఆడారు. 10 ఓవర్లకి 64 రన్నులు చేశారు. మోయీన్ అలీ 31 బాల్స్ కి 46 కొట్టి ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. డుప్లెసిస్ 36 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టుని గెలుపు వైపు నడిపించాడు. అలీ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిర సురేష్ రైనా 8 పరుగులకే పెవిలియన్ కి చేరాడు. తెలుగోడు అంబటి రాయుడు డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లనీ షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, మురుగన్ అశ్విన్ ఒక్కో వికెట్ చొప్పున నేల కూల్చారు.

సక్సెస్ కోసం..

ఇవాళ శుక్రవారం రాత్రి ముంబైలో జరిగిన ఐపీఎల్ సీజన్ 14లోని 8వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు టీమ్ లకీ ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ పై విజయం సాధించింది. చెన్నై తన మొదటి మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన చెన్నై సారథి ధోనీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్ ల్లోనూ టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగే సెలెక్ట్ చేసుకుంది. దీంతో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ కి దిగింది. కేఎల్ రాహుల్, మయాంక్ ఓపెనింగ్ కి వచ్చారు.

IPL-14 Match-8 : chennai wins over punjab
IPL-14 Match-8 : chennai wins over punjab

అత్యల్ప లక్ష్యం: IPL-14 Match-8

ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్ ల్లో ఏ జట్టూ తన ప్రత్యర్థికి ఇంత తక్కువ (107) టార్గెట్ పెట్టలేదు. పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లు ఆడింది. కానీ 8 వికెట్లు కోల్పోయి 106 రన్నులు మాత్రమే చేసింది. అందులో షారూఖ్ ఖాన్ ఒక్కడే 47 పరుగులు చేసి కొద్దిలో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. క్రిస్ గేల్ 10, దీపక్ హూడా 10, రిచర్డ్ సన్ 15 రన్నులు చేశారు. మిగతా నలుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ ఛాహర్ నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ ని బాగా దెబ్బతీశాడు. శామ్ కరన్, మోయీన్ అలీ, డ్వేన్ బ్రావో ఒకటి చొప్పున వికెట్లు పడగొట్టారు.

 

Advertisement