IPL-14 Match-7 : మిల్లర్-మోరిస్ పోరాటం.. ఢిల్లీపై రాజస్థాన్ దే..

Kondala Rao - April 15, 2021 / 11:26 PM IST

IPL-14 Match-7 : మిల్లర్-మోరిస్ పోరాటం.. ఢిల్లీపై రాజస్థాన్ దే..

IPL-14 Match-7 : ఈరోజు గురువారం రాత్రి ముంబైలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోని 7వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పై నెగ్గింది. రెండు బంతులు మిగిలి ఉండగానే రెండు పరుగులు ఎక్కువే చేసి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 రన్నుల టార్గెట్ ఛేదించేందుకు రంగంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు. 43 బంతులకే 62 పరుగులు సాధించాడు. ఇతనికి తెవాతియా (19) బాగా సహకరించాడు. క్రిస్ మోరిస్ 36, ఉనాద్కత్ 11 పరుగులు చేశారు. మిగతావాళ్లు ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. జోస్ బట్లర్ 2, మానన్ వోహ్రా 9, సంజూ శాంసన్ 4, శివం దూబే 2, రియాన్ పరాగ్ 2 రన్నులు మాత్రమే  సాధించగలిగారు. మొదటి మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేసిన సంజూ శాంసన్ ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితం కావటం అభిమానులను నిరాశ పరిచింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, అవేశ్ ఖాన్ 3, కగిసో రబాడ రెండు వికెట్లని తమ ఖాతాలో వేసుకున్నారు.

IPL-14 Match-7 : rajasthan wins over delhi

IPL-14 Match-7 : rajasthan wins over delhi

టాస్.. బౌలింగ్..

వరుసగా ఏడో మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిన జట్టు బౌలింగే ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకుంది. ఈ రెండు జట్లకూ ఇది రెండో మ్యాచ్. పంజాబ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోయింది. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్ లో ఢిల్లీ నెగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఈరోజు మొదట బ్యాటింగ్ చేసింది. పృథ్వీషా, శిఖర్ ధావన్ ఓపెనర్లు.

పంత్.. హాఫ్ సెంచరీ: IPL-14 Match-7

రెండో ఓవర్ లోనే పృథ్వీ(2) ఔట్. అజింక్య రహానే ఇన్. ఆరో ఓవర్ లో రహానే(8) వెనుదిరిగాడు. దీంతో స్టోయినిస్ వచ్చాడు. కానీ తర్వాతి ఓవర్ లోనే డకౌట్ అయ్యాడు. అతని ప్లేసులో లలిత్ యాదవ్ రంగ ప్రవేశం. 10 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 57/4 మాత్రమే. 11వ ఓవర్ లో పంత్ నాలుగు ఫోర్లు కొట్టాడు. 12వ ఓవర్ లో హాఫ్ సెంచరీ చేశాడు. 13వ ఓవర్ లో 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ పెవిలియన్ కి చేరుకున్నాడు. టామ్ కరణ్ ఎంట్రీ ఇచ్చాడు. 19వ ఓవర్ లో టామ్(21) క్లీన్ బౌల్డ్ అవగా అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. 19వ ఓవర్ లాస్ట్ బాల్ కి అశ్విన్(7) చేతులెత్తేశాడు. మొత్తమ్మీద ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ కి 148 రన్నుల లక్ష్యాన్ని నిర్దేశించారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనాద్కత్ మూడు, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండు, క్రిస్ మోరిస్ ఒక వికెట్ పడగొట్టారు.

EzBg4j9VEAEeAaX

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us