IPL-14 Match-3 : రాణించిన రాణా.. కోల్ కతాకే గుడ్ నైట్.. హైదరా‘బ్యాడే’..

IPL-14 Match-3 : చెన్నైలో ఇవాళ ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ సీజన్-14లోని మూడో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించారు. 10 పరుగుల తేడాతో నెగ్గారు. కోల్ కతా జట్టులో నితీశ్ రాణా ఒక్కడే 80 రన్నులు చేసి హైదరాబాద్ కి భారీ లక్ష్యాన్ని నిర్దేశించటంలో కీలక పాత్ర పోషించాడు. 189 టార్గెట్ ఛేదించేందుకు రంగంలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి వరకూ క్రీజులో పోరాడింది. కానీ 5 వికెట్లు కోల్పోయి 177 రన్నులు మాత్రమే చేయగలిగింది. వృద్ధిమాన్ సాహా, డేవిడ్ వార్నర్ ఓపెనర్లుగా వచ్చారు. అయితే.. వార్నర్ రెండో ఓవర్ లోనే ఔట్ అయ్యాడు. దీంతో మనీశ్ పాండే క్రీజులోకి వచ్చాడు. మూడో ఓవర్ లో మరో వికెట్ పడింది. సహా 7 రన్నులకే చేతులెత్తేశాడు. బెయిర్ స్టో బ్యాటింగ్ కి వచ్చాడు. వీళ్లిద్దరూ బాగా ఆడారు. 12వ ఓవర్ లో హైదరాబాద్ స్కోర్ వందకు చేరింది. అందులో 55 రన్నులు బెయిర్ స్టోవే. మనీశ్ పాండే 61 పరుగులు చేసినా జట్టుకు గెలిపించలేకపోయాడు. కోల్ కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు తీశాడు. షకిబ్, కమెన్స్, రసెల్ ఒక్కొక్కటి చొప్పున నేలకూల్చారు.

రాణించిన రాణా..

టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కి దిగారు. నితీశ్ రాణా, శుభ్ మన్ గిల్ ఓపెనర్లుగా వచ్చారు. వీళ్లిద్దరూ తమ జట్టుకి శుభారంభం ఇచ్చారు. ఆరు ఓవర్లలో టీమ్ స్కోర్ 50కి చేరింది. అయితే తర్వాతి ఓవర్ లోనే గిల్ 15 పరుగులకే ఔట్ అవగా రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చాడు. పది ఓవర్లకి రైడర్స్ సెంచరీ చేయగా అందులో 50 రన్నులు రాణావే. ఇతను సిక్స్ కొట్టి అర్ధ శతకం సాధించటం చెప్పుకోదగ్గ విషయం.

IPL-14 Match-3 : kolkata wins over hyderabad
IPL-14 Match-3 : kolkata wins over hyderabad

రాహుల్ కూడా: IPL-14 Match-3

15 ఓవర్లకు కోల్ కతా టోటల్ స్కోర్ 145/1. ఇదే ఓవర్ లో రాహుల్ త్రిపాఠి కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కానీ తర్వాతి ఓవర్ లోనే పెవిలియన్ కి చేరగా మైదానంలోకి రసెల్ వచ్చాడు. అతను కూడా 17వ ఓవర్ లోనే వికెట్ చేజార్చుకున్నాడు. 18వ ఓవర్ లో రెండు వికెట్లు పడ్డాయి. రాణా 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ కాగా మోర్గాన్ రెండు రన్నులకే వెనుదిరిగాడు. మొత్తమ్మీద కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 రన్నులు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కి 188 పరుగుల లక్ష్యాన్ని పెట్టారు. హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ రెండు చొప్పున, భువనేశ్వర్, నటరాజన్ ఒకటి చొప్పున వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

Advertisement