IPL-14 Match-2 : పృథ్వీ షా.. ముంబై బాద్ షా. ధావన్.. ధన్ ధనాధన్

IPL-14 Match-2 : ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ శనివారం రాత్రి జరిగిన ఐపీఎల్ సీజన్-14లోని రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) టీమ్ ని అవలీలగా ఓడించింది. పృథ్వీ షా ముంబై బాద్ షాగా నిలవగా  ఎస్.ధావన్ ధన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. పృథ్వీ షా కేవలం 38 బంతుల్లోనే 72 పరుగులు తీశాడు. శిఖర్ ధావన్ 54 బాల్స్ కే 85 వ్యక్తిగత, ఇవాళ్టి అత్యధిక స్కోరు సాధించాడు. వీళ్లద్దరూ తమ జట్టుకు విజయాన్ని అందించారు. 8 బంతులు మిగిలి ఉండగానే డీసీ టీమ్ 190 పరుగులు చేసి నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విక్టరీని నమోదు చేసింది. సీఎస్కే టీమ్ లో శార్థూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా డ్వేన్ బ్రావో ఒక వికెట్ నేలకూల్చాడు. తాజా ఐపీఎల్ తొలి మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిన కోహ్లీ సేనే సక్సెస్ అయింది.

టాస్.. ఇంట్రస్ట్..

అంతకుముందు టాస్ గెలిచిన డీసీ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాను టాస్ నెగ్గినా ఇదే పని చేసేవాణ్ని అని సీఎస్కే సారథి ధోనీ కూడా చెప్పటం గమనార్హం. సీఎస్కే తరఫున డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ కి దిగగా రెండో ఓవర్ లోనే డుప్లెసిస్ ఔట్ అయ్యాడు. మొయిన్ అలీ బ్యాటింగ్ కి వచ్చాడు. సీఎస్కే టీమ్ మూడో ఓవర్ లో మరో వికెట్ ని చేజార్చుకుంది. గైక్వాడ్ పెవిలియన్ కి చేరాడు. దీంతో రైనా రంగంలోకి దిగి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 9వ ఓవర్ లో మొయిన్ ఔట్ కావటంతో తెలుగు బ్యాట్స్ మన్ అంబటి రాయుడు క్రీజులోకి అడుగు పెట్టాడు. పది ఓవర్లకు ధోనీ సేన స్కోర్ 71/3. మరో నాలుగు ఓవర్లకు రాయుడు వికెట్ ని చేజార్చుకున్నాడు.

IPL-14 Match-2 : delhi capital team won the 2nd match
IPL-14 Match-2 : delhi capital team won the 2nd match

ధోనీ డకౌట్: IPL-14 Match-2

రాయుడు వెళ్లిపోవటంతో రవీంద్ర జడేజా ఎంట్రీ ఇచ్చాడు. 16వ ఓవర్ లో సీఎస్కే జట్టుకి గట్టి షాక్ తగిలింది. ఇద్దరు సీనియర్ బ్యాట్స్ మన్ చేతులెత్తేశారు. 54 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచిన రైనాతోపాటు పరుగులేమీ చేయకుండానే కెప్టెన్ ధోనీ డకౌట్ అయ్యారు. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 రన్నులు చేశారు. ప్రత్యర్థి జట్టుకు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. డీసీ టీమ్ లో క్రిస్ ఓక్స్, అవేశ్ ఖాన్ రెండు వికెట్ల చొప్పున; అశ్విన్, టామ్ కుర్రాన్ ఒక్కొక్కటి చొప్పున తమ ఖాతాల్లో వేసుకున్నారు.

Advertisement