IPL-14 Match-14 : బెయిర్ స్టో.. బెస్ట్ షో. ఎట్టకేలకు రైజ్ అయిన హైదరాబాద్

IPL-14 Match-14 : ఇవాళ బుధవారం చెన్నైలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోని 14వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ కింగ్స్ టీమ్ ని 9 వికెట్ల తేడాతో ఓడించింది. మరో 8 బాల్స్ మిగిలి ఉండగానే ఒక్క వికెట్ ని మాత్రమే కోల్పోయి నెగ్గింది. మొత్తానికి నాలుగో మ్యాచ్ లో గానీ విక్టరీ సాధించలేకపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో బెయిర్ స్టో 63 రన్నులతో నాటౌట్ గా నిలవటం విశేషం. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 37 పరుగులతో మెరిశాడు.

IPL-14 Match-14 : first victory for sunrisers hyderabad
IPL-14 Match-14 : first victory for sunrisers hyderabad

శుభారంభం..

121 పరుగుల తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్స్ రైజర్స్ హైదరాబాద్ కి శుభారంభం లభించింది. 73 పరుగుల వరకు కూడా ఒక్క వికెట్ పడలేదు. పదకొండో ఓవర్ లో డేవిడ్ వార్నర్ 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అలెన్ బౌలింగ్ లో అగర్వాల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన కేన్ విలియమ్సన్.. బెయిర్ స్టోకి చక్కని సహకారం అందించాడు. మరో వికెట్ పడకుండా చివరి వరకు నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా పది మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికైనా బోణీ చేయటం మంచి పరిణామం.

స్వల్పమే: IPL-14 Match-14

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ హైదరాబాద్ టీమ్ కి తక్కువ టార్గెట్టే (121) పెట్టింది. 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేదు. రెండు బంతులు ఉండగానే ఆలౌట్ అయ్యారు. మయాంక్ అగర్వాల్, షారూఖ్ ఖాన్ చెరో 22 పరుగులు చేశారు. ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావటం గమనార్హం. కెప్టెన్ కేఎల్ రాహుల్ 4 రన్నులు మాత్రమే చేశాడు. క్రిస్ గేల్ 15 పరుగులకే పెవిలియన్ చేరటంతో పంజాబ్ కింగ్స్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఖలీద్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.

Advertisement