IPL-14 Match-1 : బెంగళూరు బోణీ..

IPL-14 Match-1 : ఇవాళ శుక్రవారం చెన్నైలో ప్రారంభమైన ఐపీఎల్ 14వ సీజన్ లో బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. చివరి బంతి వరకూ ఆడి 8 వికెట్లు కోల్పోయి రెండు పరుగుల తేడాతో నెగ్గింది. మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడగా రాయల్స్ నే మొదటి విజయం వరించింది. 160 రన్నుల లక్ష్యంతో ఆట మొదలుపెట్టిన కోహ్లీసేన మొదటి ఓవర్ లోనే పది పరుగులు సాధించింది. ఓపెనర్లుగా కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ వచ్చారు. 5వ ఓవర్ లో సుందర్ ఔటయ్యాడు. కేవలం పది రన్నులు చేశాడు. తర్వాతి ఓవర్ లో పాటిదార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పది ఓవర్లలో టీమ్ స్కోర్ 75కి చేరింది. 13వ ఓవర్ లో కోహ్లీ(33) వికెట్ కోల్పోయాడు. 14 ఓవర్లకు స్కోర్ వంద దాటింది. 15వ ఓవర్ లో ఏకంగా రెండు వికెట్లు పడ్డాయి. మ్యాక్స్ వెల్, షాబాజ్ అహ్మద్ పెవిలియన్ కి చేరారు. 17వ ఓవర్ లో 6వ వికెట్ కోల్పోయింది. డివిలియర్స్ హయ్యస్ట్ స్కోర్ 48 చేశాడు. ముంబై టీమ్ లోని బుమ్రా, జాన్సన్ రెండు రెండు వికెట్లు తీయగా బౌల్ట్, పాండ్య ఒక్కొక్కటి చొప్పున వికెట్లు నేలకూల్చారు.

టార్గెట్ 160 మాత్రమే..

ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, మరో బ్యాట్స్ మన్ క్రిస్ లిన్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగారు. అయితే ముంబై టీమ్ కి శుభారంభం లభించలేదు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 19 పరుగులే చేసి అనవసరంగా రనౌట్ అయ్యాడు. దీంతో 24 రన్నులకే తొలి వికెట్ కోల్పోయింది. సూర్య కుమార్ క్రీజులోకి వచ్చాడు. క్రిస్ లిన్, ఇతను బాగానే ఆడటంతో 7 ఓవర్లకు జట్టు స్కోరు 55కి చేరింది. 8వ ఓవర్ లో 15 పరుగులు పిండుకున్నారు. అయితే 11వ ఓవర్ లో సూర్య పెవిలియన్ చేరాడు. అప్పటికి ముంబై స్కోరు 94/2. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కి వచ్చాడు.

IPL-14 Match-1 : bengalore won the match
IPL-14 Match-1 : bengalore won the match

నో హాఫ్ సెంచరీ: IPL-14 Match-1

క్రిస్ లిన్ 49 రన్నుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. దీంతో ఆఫ్ సెంచరీ మిస్ అయింది. అంతేకాదు. ముంబై ఇండియన్స్ లో ఒక్కరు కూడా అర్ధ శతకం చేయలేదు. క్రిస్ లిన్ ఔట్ అవటంతో హార్దిక్ పాండ్య మైదానంలోకి అడుగుపెట్టాడు. 13వ ఓవర్ లో మొత్తం పరుగులు 100 మార్క్ ను చేరుకున్నాయి. 13 పరుగులే చేసిన పాండ్య 16వ ఓవర్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో కీరన్ పోలార్డ్ వచ్చాడు. 18వ ఓవర్ లో ఇషాన్ కిషన్ కూడా లెగ్ బిఫోర్ వికెట్ గా దొరికిపోయాడు. అనంతరం మరో పాండ్య అంటే కృనాల్ పాండ్య ఎంట్రీ ఇచ్చాడు. 19వ ఓవర్ కి ముంబై స్కోర్ 158/5. ఆఖరి ఓవర్ లో ఒక్క రన్నే రావటంతో ముంబై.. బెంగళూరుకి 160 టార్గెట్ పెట్టింది. ఐదు వికెట్లలో హర్షర్ పటేల్ రెండు; వాషింగ్టన్ సుందర్, జెమీసన్ ఒక్కోటి చొప్పున తీశారు. మరొకటి రనౌట్.

Advertisement